ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాఖాహారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకొందరైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు జంతు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా వేగన్ మారిపోతున్నారు. అలాంటి వారు కేవలం మొక్కలు, వాటి ఆధారిత ఆహారాన్నే తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి వారికోసం గుడ్లు, చికెన్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేపలు కూడా చేరాయి. అవును ఇప్పుడు వేగన్ చేప ఉత్పత్తులు కూడా మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి.
ఈ వేగన్ చేపలు చూడటానికే కాదు.. తినేటప్పుడు అచ్చు మీకు చేపల్ని తిన్న ఫీలింగే వస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని కేవలం మొక్కలు, మొక్కల ఆధారిత పదార్థాలతోనే తయారు చేయడం విశేషం. ఇవి ఎంతలా డెవలప్ అయ్యాయి అంటే.. ట్యూనాని పోలిన వెజ్ ట్యూనాని కూడా తయారు చేశారు. ఈ వెజ్ చేపల తయారీ కోసం గోధుమల్లోని ప్రొటీన్, సోయాతో చేసిన టోఫూ పదార్థాలకు సముద్రంలో లభించే నాచు, సోయాసాస్, రైస్ వైన్, ఉప్పు వంటి పదార్థాలను జోడించి ఈ వేగన్ ఫిష్ తయారు చేస్తున్నారు.
🎬 How to make…
VEGAN BANANA BLOSSOM ‘FISH’ & CHIPS
Recipe 👉🏼 https://t.co/kaNgboU0Oa pic.twitter.com/HEmvc1ouvZ— TheVegSpace (@TheVegSpace) July 30, 2022
ఇవి అచ్చూ సముద్రపు చేప రుచినే పోలి ఉంటాయంట. ఈ మధ్య ఢిల్లీకి చెందిన ఓ ఫుడ్ వ్యాపారి చేసిన వెజ్ ఫిష్ ఫ్రై నెట్టింట వైరల్ గా మారడం కూడా చూశాం. అయితే ఇప్పుడు ఈ వెజ్ ఫిష్ పై శాఖాహారులే కాదు.. మాంసాహారులు సైతం మనసు పారేసుకుంటున్నారు. ఎందుకంటే.. సముద్రపు చేపలు తినడం వల్ల వాటిలో అధికంగా ఉండే మెర్కురీ, మైక్రో ప్లాస్టిక్ వల్ల అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు.
Made vegan fish and chips with banana blossom 😍 pic.twitter.com/BRWGuoZsk1
— 6ft3 vegan funny cuteness (@r4v5t4r) July 25, 2022
అంతేకాకుండా కొందరికి ఈ వంటకాలు పడక అలర్జీలు సైతం వస్తున్నాయి. అందుకే అంతా ఎంచక్కా వెజ్ ఫిష్ వంటకాలకే జై కొడుతున్నారు. రాను రాను చేపల్ని తినేవాళ్ల సంఖ్య పెరుగుతుండటంతో.. కొన్ని రకాల చేపలు అయితే 75 శాతం తగ్గిపోయాయంటున్నారు. పర్యావరణ నిపుణులు సైతం వేగన్ చేపలనే ప్రిషర్ చేయాలంటూ సూచిస్తున్నారు. రానున్న పదేళ్లలో ఈ వేగన్ ఫిష్ వ్యాపారం గ్లోబల్ గా 28 శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ వేగన్ ఫిష్ ప్రొడక్ట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
We put vegan “fish and chips” to the test pic.twitter.com/VTPAXypWvK
— Food Insider (@FoodInsider) July 25, 2022