ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలతో విమానాలు కూలిపోవడం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలో ఓ ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్కడ నిర్వహించిన విమానాల ప్రదర్శనలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ద విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో వ్యతిరేక దిశలో ఒకదానినొకటి ఢీ కొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో గాయపడిన పైలట్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో వైమానికి ప్రదర్శన జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అనేక యుద్ద విమానాలతో పాటు అత్యాధునికి వైమనిక దళాలను ప్రదర్శించారు. ఈ సమయంలో బోయింగ్ బి-17 బాంబర్ యుద్ధ విమానం, పి-63 కింగ్ కోబ్రా అనే మరో యుద్ద విమానం ఆకాశంలో ప్రదర్శనలు చేస్తున్నాయి. వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులందరూ వీడియోలు సైతం తీస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా మార్గం తప్పిన కోబ్రా యుద్ధ విమానం వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద శబ్దంతో విమానాలు పేలిపోయి నేలపై కూలిపోయాయి. ఆకాశంలోనే విమానాలు ముక్కలవుతూ నేలపై పడిపోయాయి. ఈ రెండు విమానాల్లోని పైలట్ల ఆరోగ్యం గురించి ఇంకా సమాచారం అందలేదు.
అయితే వారి పరిస్థితి విషయంగా ఉన్నట్లు వివిధ మార్గంలో సమాచారం బయటకు వచ్చింది. ప్రమాదం జరుగుతున్న సమయంలో అందరూ వీడియో తీయడం వల్లన.. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎయిర్ ఫోర్స్ వింగ్స్ స్మారకంగా నిర్వహించిన విమానాల ప్రదర్శనలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. బోయింగ్, కోబ్రా యుద్ద విమానాలు రెండో ప్రపంచ యుద్దకాలంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే ఈ రెండు యుద్ధ విమానాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు. విమానాల ఢీకొన్న ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
— Giancarlo (@GianKaizen) November 12, 2022