ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఓ ప్రాంతంలో విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతి సమస్యలు లేదా ప్రకృతి వైపరీత్యం కారణంగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ విమాన ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పొతున్నారు. ఇటీవల అమెరికాలోని ఓ ప్రాంతంలో ఎయిర్ షో జరుగుతుండగా రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్నిఓ విమానం ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కానట్లు సమాచారం. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..
అమెరికలోని మేరీలాండ్ ప్రాంతంలోని మాంట్ గోమేరీలో ఓ చిన్నపాటి విమానం ఆకాశంలో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఈ తేలికపాటి విమానం వెళ్లి ఢీ కొట్టింది. విమానం బలంగా వెళ్లి స్తంభాన్ని ఢీకొనడంతో అందులో చిక్కుకుపోయింది. దీంతో కరెంట్ స్తంభం కాస్తా వగిపోయింది. తీగలు కూడా ఎక్కడిక్కడ తెగిపోయినట్లు సమాచారం. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం కారణంగా వారికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక మీడియా తెలిపింది. స్థానికంగా ఆదివారం వర్షం పడటంతో వాతావరణ పరిస్థితుల ప్రతికూల మారాయి. వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కరెంట్ స్తంభాన్ని విమానం ఢీ కొట్టడం వలన విద్యుత్ తీగలు రోడ్డుపై పడి ఉన్నాయని.. అటువైపు ఎవరూ వెళ్లొద్దంటూ పోలీసులు ట్విటర్ ద్వారా స్థానిక ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రమాదం కారణంగా మాంట్ గోమేరీలోని 90వేల ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
A small plane has crashed into power lines in the area of Rothbury Dr & Goshen Rd, taking out power to parts of the county.@mcfrs is on scene. PLEASE AVOID THE AREA, as there are still live wires. #MCPD #MCPNews
— Montgomery County Department of Police (@mcpnews) November 27, 2022