నిద్రించే సమయంలో వ్యక్తి శ్వాసపీల్చేటప్పుడు, శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారితీస్తుంది. నిద్రిస్తున్నపుడు శ్వాసతీసుకోవడంలో గాలి సర్కులేట్ అవుతూ ఓకల్ కార్డులను కంపింప చేస్తూ ధ్వని పుట్టిస్తుంది. గాలి అధికమయ్యే కొద్ది ధ్వని అధికమవుతుంది. నిద్రించే సమయంలో నోరు, ముక్కు ద్వారా గాలి సులభంగా పోకపోవడంతో గురకకు కారణం అవుతుంది. లావుగా ఉన్నవారిలో గురక సమస్య అధికం. కనుక వారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మంచాన్ని తలవైపు ఎత్తు ఉండేలాగా అమర్చుకుని నిద్రపోతే చాలావరకూ గురక సమస్యను నివారించుకోవచ్చు.
ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక సమస్య తగ్గుతుంది. అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. మంచి ఫలితం కనిపిస్తుంది.
నిద్రలో గురక పెట్టటం అనేది అనారోగ్య లక్షణం. జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకోవటం ద్వారా గురక రాకుండా చూసుకోవచ్చు. నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. తలవైపు ఎత్తు ఉండేలాగా అమర్చుకుని నిద్రపోతే గురక సమస్యను నివారించుకోవచ్చు.
మరిన్ని వివరాలకై వీడియో చూడండి: