చల్లచల్లని బీర్.. నెమ్మదిగా గొంతు దిగుతుంటే ఆ కిక్కే వేరంటూ బీరు ప్రియులు లొట్టలేస్తుంటారు. ఒక్కో బ్రాండ్ బీర్.. ఒక్కో టేస్ట్.. అంటూ నాలుక చప్పరిస్తుంటారు. ఇక మద్యం తయారి గురించి చాలా మంది చాల రకాల కథలు చెప్తుంటారు. ముఖ్యంగా సారా తయారీలో ఎలాంటి చెత్త చెదారం వాడతారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే.. మద్యం తయారీ గురించి ఎంత బాగా విడమర్చి చెప్పినా మందుబాబులు.. ఆ మాటలను చెవికెక్కించుకోరు. కిక్కు ముఖ్యం కానీ.. అది ఎలా తయారయితే మాకేంటి అంటారు. ఇప్పుడు మీరు చదవబోయే బీరు తయారీ కూడా ఈ కోవకు చెందినదే. ఎందుకంటే.. ఆ బీర్‌ను మూత్రంతో, డ్రైనేజీ వాటర్ ని నుంచి తీసిన నీటితో తయారు చేస్తారు మరి. చదవగానే ఛీ ఇదెక్కడి దరిద్రం అనిపించినా.. టేస్ట్ చూసి వదిలడం లేదట బీర్ ప్రియులు. ఆవివరాలు..
సింగపూర్‌లో ఈ బీర్ తయారవుతోంది. ప్రస్తుతం సింగపూర్ తీవ్ర నీట కరువు ఎదుర్కొంటుంది. డ్రైనేజీ వాటర్, టాయిలెట్ వాటర్ ఇలా ప్రతి దాన్ని పూర్తిగా శుద్దీ చేసి వాడాల్సిందే అని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా శుద్ది చేసిన నీటికి ‘నీ వాటర్’ అని పేరు పెట్టారు. ఈ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వ వాటర్ ఏజెన్సీ పీయూబీ, స్థానిక బీరు తయారీ సంస్థ బ్రూవర్క్‌జ్ కలిసి ‘న్యూబ్రూ’ను మార్కెట్లోకి తెచ్చాయి. దీన్ని నీ వాటర్‌తో తయారు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Beer Price: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. ఒక్కో బీరుపై రూ. 20 పెంపు!
న్యూబ్రూ బీర్‌ను 95 శాతం ‘నీ వాటర్’తోనే తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఈ బీర్ తయారీలో జర్మన్ బార్లీ మాల్ట్‌లు, సుగంధ సిట్రాతోపాటు దిగుమతి చేసుకున్న ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారు. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటల్ వీక్‌తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ సంస్థలు ఈ బ్రాండ్‌ను ఏప్రిల్ 8న మార్కెట్‌లోకి విడుదల చేశారు. మంచి మాల్ట్‌తో, తాగాక తేనె వంటి రుచిని ఇస్తుండటంతో ‘న్యూబ్రూ’ బీర్‌కు బాగా డిమాండ్ కనిపిస్తోందని సింగపూర్ అధికారులు చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.