యమన్ కు సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా యమన్ జైలుపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 100 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి జరిగిన ఈ భయంకరమైన దాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉందని యమన్ లోని రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బషీర్ ఒమర్ వెల్లడించారు.
Over 100 Killed Or Injured In Yemen Prison Attack, Says Red Cross https://t.co/wt1iDRC3V3 pic.twitter.com/t73p1D06ju
— NDTV News feed (@ndtvfeed) January 21, 2022
ఈ జనవరి 17న UAE రాజధాని అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఎయిపోర్టుపై యమన్ హౌతీ తిరుగుబాటుదారులు బాంబ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందారు. దీనికి ప్రతీకార చర్యగా.. ఆ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న యమన్ రాజధానిపై వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 11 మంది మృతి చెందారు.
At least 70 people killed in a Saudi-led coalition air raid on a prison in Yemen’s northern city of Saada https://t.co/lk9jAT50nU pic.twitter.com/avEZ2hqKoS
— Al Jazeera English (@AJEnglish) January 21, 2022
తాజాగా మరోసారి యమన్ రాజధాని సనా నగరంపై సౌదీ వైమానిక దాడులు జరిపింది. ఈసారి భారీగా ప్రాణనష్టం సంభవించింది. జైలుపై జరిగిన వైమానిక దాడితో అక్కడ పరిస్థితులు హృదయ విధారకంగా మారాయి. క్షతగాత్రులను, మృతదేహాలను వెలికి తీస్తున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడి వలన దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని తెలిపారు. కానీ ఈ దాడులకు సంబంధించి ఎలాంటి ప్రకటన సౌదీ అరేబియా చేయలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Au moins 70 personnes ont été tuées et une centaine blessées vendredi dans une frappe aérienne contre une prison tenue par les rebelles #Houthis au #Yémen, une attaque attribuée à la coalition sous commandement saoudien et témoignant d’une vive escalade de la #violence. pic.twitter.com/1ZAJcBE4tY
— Ghassan Basile (@gnbasile) January 21, 2022