ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. రష్యన్ బలగాలు ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ప్రపంచ దేశాలు ఎంత వారించినా.. ఎంతగా నచ్చజెప్పినా రష్యా అధ్యక్షులు పుతిన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు.. యుద్ధం మొదలైపోయింది. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని మెయిన్ సిటీస్‌ను టార్గెట్ చేసింది రష్యా. కేపిటల్ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే యుద్దం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇంత వేగంగా ఒక దేశాన్ని ఆక్రమిస్తుండటం బహుశా ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరిగి ఉండకపోవచ్చేమో. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ప్రకటించిన నాలుగు గంటల వ్యవధిలోనే… ఉక్రెయిన్ లోని 13 ప్రధాన నగరాలపై రష్యా దాడి చేసింది. కీవ్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్నాయి. రష్యన్ బలగాల బాంబుదాడులతో ఉక్రెయిన్ వణుకుతోంది. భీకర యుద్దంతో రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కేవలం రెండు గంటల్లోనే మకాం వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రతి 10 నిమిషాలకు ఒక్కో నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుందంటే రష్యా దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా రష్యా అధ్యక్షులు పుతిన్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని.. ఉక్రెయిన్ కు ప్రతిఘటించే అవకాశాన్ని కూడా ఇవ్వని విధంగా రష్యా దాడి చేస్తోందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆరోపిస్తున్నారు.