గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ భూకంపాలు అలజడి సృష్టిస్తున్నాయి. గత ఏడాది అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం సంబవించింది.. వెయ్యి మందికి పైగా మృతి చెందగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఆ పెను విషాదం మరువక ముందే ఈ ఏడాది టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంబవించింది. రిక్టార్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. ఆ తర్వాత కూడా పలు మార్లు భూమి కంపించింది. ఈ భూకంపాల తీవ్రతకు టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య 4372కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ భారీ భూకంపం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇదిలా ఉంటే ఇంత పెద్ద భూకంపం సంబవిస్తుందని.. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 7.5 ఉండబోతుంది నెదర్లాండ్స్ కు చెందిన పరిశోధకుడు ముందే అంచనా వేశాడు. ప్రమాదానికి మూడు రోజుల ముందుగానే పసికట్టి మరీ ట్విట్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా భూకంపాలు, సునామీలు వస్తే ప్రకృతి లో కొన్ని విచిత్రమైన మార్పులు వస్తుంటాయి.. అవి ప్రమాదాలకు సంకేతం అని కొంత మంది ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. అయితే ఇంత పెద్ద భూకంపం వస్తుందని ముందుగానే ఊహించి ట్విట్ చేసిన వ్యక్తి పేరు ఫ్రాంక్ హూగర్‌బీట్స్. ఈయన గత కొంత కాలంగా భూకంపాల పనితీరుపై పరిశోధన చేస్తున్నారు. ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ‘త్వరలో సౌత్ సెంట్రల్, సిరియా, టర్కీ, జోర్డాన్, లెబనాన్ పరిసర ప్రాంతాల్లో ఫిబ్రవరి 6 తెల్లవారు జామున భారీ భూకంపం వస్తుంది’ అంటూ ట్విట్వర్ వేధికగా ఫిబ్రవరి 3వ తేదీన తెలియజేశాడు.
సోలార్ సిస్టం జియోమెట్రిక్ సర్వే విభాగంలో పరిశోధకుడిగా పనిచేస్తున్న ఫ్రాంక్ హూగర్‌బీట్స్ గతంలో పలుమార్లు భూకంపానికి సంబంధించిన పలు హెచ్చరికలు చేశారు.. కానీ ఆయన అంచనాలు ఏనాడూ నిజం కాలేదు.. దాంతో ఆయన చేసిన ట్విట్ పై ఎవరూ దృష్టి సారించలేదు. కానీ ఈసారి ఫ్రాంక్ హూగర్‌బీట్స్ రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.5 ఉంటుందని చేసిన హెచ్చరికలు అక్షర సత్యం అయ్యాయి. అంతేకాదు ఈ ప్రాంతాల్లో భూమి పలుమార్లు ప్రకంపిస్తుందని కూడా ఆయన తెలియజేశారు. అదేవిధంగా జరిగి భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. అయితే ఫ్రాంక్ ట్విట్ పై మొదట కొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎందుకు ఇలాంటి ఉపద్రవాలను కోరుకుంటారని అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన చెప్పిన రెండు సంఘటనలు నిజం కావడంతో ఆయనకు క్షమాపణలు చెప్పారు.
టర్కీ, సిరియాలో సోమవారం తెల్లవారు జామున అందరూ గాఢ నిద్రలో ఉండగా భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల వేల సంఖ్యలో ప్రాణ నష్టం, కోట్లలో ఆస్తి నష్టం సంబవించింది. ఈ దారుణ ఘటనపై ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పింది నిజం కావడం ఎంతో దురదృష్టమని వేల మంది ప్రాణాలు పోవడం ఎంతో బాధగా ఉందని ట్విట్ చేశారు. మరోవైపు ఇలాంటి భూకంపాలు మళ్లీ వస్తాయా.. ముందుగానే అంచనా వేసి చెప్పగలరా అంటూ నెటిజన్లు ఫ్రాంక్ హూగర్‌బీట్స్ అడుగుతున్నారు. అంతేకాదు ట్విట్టర్‌లో ఫ్రాంక్ ఫాలోవర్లు కూడా బాగా పెరిగిపోయారు. ఈ క్రమంలో తన పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేస్తున్నారు.. అలాంటి వారిపై ఫిర్యాదు చేయాలని ఫ్రాంక్ హూగర్‌బీట్స్ సూచించాడు.
Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV
— Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023
My heart goes out to everyone affected by the major earthquake in Central Turkey.
As I stated earlier, sooner or later this would happen in this region, similar to the years 115 and 526. These earthquakes are always preceded by critical planetary geometry, as we had on 4-5 Feb.
— Frank Hoogerbeets (@hogrbe) February 6, 2023