ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఈ రెండు దేశాల మధ్య వైరల్ ఇప్పటిది కాదు. ఇప్పటికే రెండు సార్లు ఈ రెండు దాయాది దేశాల మధ్య అధికారిక ఇప్పటి వరకు నాలుగుసార్లు యుద్ధం జరిగింది. అన్నీ యుద్దాల్లోను పాకిస్థాన్ కి పరాభవం తప్పలేదు. ఇక 1971 లో బాంగ్లాదేశ్ విమోచన కోసం జరిగిన యుద్ధం, 1999లో జరిగిన కార్గిల్ వార్ లో భారత్ పోరాట పటిమ ప్రపంచ దేశాలకి తెలిసి వచ్చింది. కానీ.., అప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య అధికారిక యుద్ధం అయితే జరిగింది లేదు. కానీ.., పాకిస్థాన్ మాత్రం సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కాల రాస్తూ.., కాల్పులు జరుపుతూనే ఉంది. భారత్ దీనికి ఎప్పటికప్పుడు బుద్ది చెప్తూనే ఉంది. కాబట్టి.., ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికీ స్నేహపూర్వక సంబంధాలు లేవు. ఇప్పట్లో రావు కూడా.
శత్రువు బలాలు, బలహీనతలు తెలిసి ఉంచుకొవడం ఎప్పటికైనా మంచిదే. భారతీయ సైన్యం బలం ముందు పాకిస్థాన్ ఏ విషయంలోనూ కనీసం పోటీ ఇవ్వలేదు. కానీ.., ఒక్క అణ్వస్త్రాల విషయంలో మాత్రం పాకిస్థాన్ భారత్ కన్నా బలంగా ఉంది. ఇప్పటి వరకు ఇండియా దగ్గర ఉన్న అణ్వస్త్రాలు 156 మాత్రమే. ఇదే సమయంలో పాకిస్థాన్ వద్ద 165 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఆర్ధికంగా, సాంకేతికంగా, దౌత్య సంబంధాల పరంగా.. అన్నిట్లో ఇండియా పాకిస్థాన్ కన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో అణ్వస్త్రాల విషయంలో మనం పాకిస్థాన్ ని ఎందుకు అధిగమించలేకపోయాము?
నిజానికి ప్రపంచంలో ప్రస్తుతం 9 దేశాలకు మాత్రమే అణ్వస్త్ర సామర్ధ్యం ఉంది. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తరకొరియాల వద్ద ఈ అణ్వాయుధాలున్నాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలు దాదాపు 13,080 కాగా, వీటిలో 90 శాతం పైగా అణ్వాయుధాలు అమెరికా, రష్యా వద్దనే ఉన్నాయి. ఈ విషయంలో చైనా కూడా చాలా వెనుక పడి ఉంది.
అణ్వాయుధాల తయారీకి అవసరమైన ముడి పదార్ధాన్ని ఫిస్సైల్ మెటీరియల్ అంటారు. అత్యంత శుద్ధిచేసిన యురేనియం లేదా సెపరేటెడ్ ప్లుటోనియంను మిస్సైల్ మెటీరియల్‌గా వాడతారు. ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్‌లు రెండు రకాల మిస్సైల్ మెటీరియల్‌ను ఉత్పత్తి చేయగలవు. ఇక పాకిస్తాన్ యురేనియం ఉత్పత్తి చేసుకుంటూ.., ప్లుటోనియం ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే పనిలో ఉంది. కానీ.., ఇండియా పరిస్థితి వేరు. ఇండియా ప్లుటోనియంను ఉత్పత్తి చేస్తుండగా యురేనియం విషయంలో చాలా వెనుకపడిపోయి ఉంది. ఈ కారణంగానే భారత్ కన్నా పాకిస్థాన్ వద్ద అణ్వస్త్రాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.