మనిషికి కూడు, గూడు , బట్టలు అవసరం. వాటి కోసం మనిషి అప్పు చేస్తాడు. మనిషి అప్పు చేయడం సహజం.. ఆ అప్పు తీర్చడానికి తనకు ఉన్న ఆస్తులను బ్యాంక్ లో పెట్టడం గానీ.. లేదా ఇంటిని అమ్మడం గానీ చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. తాజాగా ఓ వ్యక్తి తన ఇంటిని అమ్మాడు. ఇందులో విశేషం ఏముంది అంటారా? విశేషం ఉంది.. ఆ వ్యక్తి సామాన్యూడేమీ కాదు. అందులోను కోట్ల రూపాయలకు అధిపతి. అతను ఎవరో కాదు.. ఫేస్ బుక్ సహవ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్. అతనికి ఇళ్లు అమ్మాల్సినంత అవసరం ఏమిటి? లాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
మార్క జుకర్ బర్గ్.. ఈ పోటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి. ఫేస్ బుక్ సహవ్యవస్థపకుడిగా అందరికి సుపరిచితుడే. తాజాగా అతను ఇల్లు అమ్మడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పదేళ్ల క్రితం కొన్న ఇంటిని ఆయన విక్రయించారు. ఈ ఏడాది తన సంపదలో సుమారు సగం సంపద కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మార్క్ తన ఇంటిని విక్రయించినట్లు తెలుస్తోంది.
2012 నవంబర్ లో జుకర్ బర్గ్ ఒక ఇంటిని 10 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీలో దాని విలువ దాదాపు రూ.79 కోట్లు. ఆ ఇంటిని శాన్ ఫ్రాన్సిస్కోలోని మిషన్ డిస్ట్రిక్ట్ కు సమీపంలో 10 గుంటల స్థలంలో 1928లో నిర్మించారు. సూమారు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని కట్టారు. జుకర్ తన భార్య ప్రిసిలా చాన్ తో కలిసి 2013లో భారీ గా డబ్బు వెచ్చించి తమకు కావాల్సిన రీతిలో డిజైన్ చేసుకున్నారు. తాజాగా ఈ ఇంటిని 31 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అంటే మన డబ్బులో దాదాపు రూ.245 కోట్లు అన్నమాట. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ సంవత్సరంలో ఇదే అత్యంత ఖరీదైన ఇంటి విక్రయంగా నమోదైంది.
జుకర్ కు సిలికాన్ వ్యాలీ, లేక్ టేహో, హవాయ్ లలోనూ ఇళ్లు ఉన్నాయి. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మార్క్ సంపద 61.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022లో మార్క్ సంపద విలువ సగానికి పైగా హరించుకుపోయినా, ప్రపంచ కుబేరుల్లో 17వ స్థానంలో ఉన్నారు. మరి మార్క్ తన నివాసం అమ్ముకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.