నిజం గొంతు నొక్కేస్తూ అవినీతి మీడియా ఛానల్ లో పని చేస్తూ ఇమడలేక ఇబ్బందులు పడే జర్నలిస్టులకు.. వాస్తవాన్ని బయటపెట్టిన కారణంగా ఉద్యోగం కోల్పోయిన జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇక నుంచి వీరంతా ఎక్స్ అనే మీడియా కంపెనీలో నెల నెలా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చునని ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఎక్స్ (ఎక్స్ ట్విట్టర్) లో బ్లూ టిక్ లతో డబ్బు వెనకేసుకుంటున్న ఎలాన్ మస్క్.. తాను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎక్స్ లో టైం పాస్ చేసే యూజర్లు కూడా కొంత సంపాదించుకునేలా మానిటైజేషన్ ఫీచర్ ని పరిచయం చేశారు. వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే మానిటైజేషన్ రూల్స్ ప్రకారం డబ్బు సంపాదించుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి ఓ మోస్తరు సెలబ్రిటీల వరకూ డబ్బు సంపాదించుకునే అవకాశం మస్క్ కల్పించారు. అయితే ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి జర్నలిస్టులకు కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. కంటెంట్ క్రియేట్ చేయడం అందరి వల్ల అవ్వదు.
చాలా మంది రాయడానికి ఉన్నంత సమయం క్రియేషన్ కి ఉండదు. పైగా చాలా మందికి రాయడం అంటేనే ఇష్టం. తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకోవడం ద్వారా కూడా డబ్బు సంపాదించుకోవచ్చునని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఆర్టికల్ రాయడానికి ఎవరైతే ఎక్కువ స్వేచ్ఛ కోరుకుంటున్నారో, ఎవరైతే తమ ఆర్టికల్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారో అలాంటి జర్నలిస్టులు నేరుగా ఎక్స్ ప్లాట్ ఫారంలో తమ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేసుకోవచ్చునని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
ఇందుకోసం ఆర్టికల్ చదివే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యూజర్లు చదివే ఆర్టికల్ ని బట్టి ఛార్జీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెలవారీ చందాదారునిగా చేరవలసి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే మరింత చెల్లించవలసి ఉంటుంది. ఎలాంటి ఒత్తుడులకు లొంగకుండా సహజంగా జర్నలిజం చేసిన వారిని కొన్ని మీడియా సంస్థలు తొలగించినప్పటికీ ఎక్స్ లో వారికి ఆహ్వానం ఉంటుందని మస్క్ ట్వీట్ చేశారు. వీరంతా ఉన్నది ఉన్నట్టు జనానికి చెబుతూ స్వేచ్ఛగా జర్నలిజం చేసుకోవచ్చునని అన్నారు.
Just like X welcomed @TuckerCarlson with proper recognition & now he is exercising his views with freedom on this platform, X should expand the scope across the globe to welcome every Journalist on earth who may have been fired from their channels in their respective countries…
— Elon Musk (Parody) (@elonmuskewl) August 21, 2023
Citizen journalism is indeed going to bring a paradigm shift in media & will be the first step toward freedom of speech based on logic and facts.
Over the next 2 years, I anticipate citizen journalists will eventually become more famous than mainstream journalists.
People will…
— Elon Musk (Parody) (@elonmuskewl) August 21, 2023