సరద కోసం చేసే కొన్ని పనులు కష్టాలను తెచ్చిపెడుతుంటాయి. అంతేకాక వీటి వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. తాజాగా ఓ వ్యక్తి సరదాగా వేట చేయాలని అడవికి వెళ్లాడు. అయితే కాస్త దూరం వెళ్లి తిరిగి వచ్చి ఉంటే సరిపోయేది. అయితే అడవిలో తప్పిపోయి దాదాపు నెల రోజుల పాటు నరకయాతన అనుభవించాడు. మూత్రం తాగుతూ, కీటకాలను తింటూ ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చాడు.
సరద కోసం చేసే కొన్ని పనులు కష్టాలను తెచ్చిపెడుతుంటాయి. అంతేకాక ఈ సరదాల వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి సరదాగా వేట చేయాలని అడవికి వెళ్లాడు. అయితే కాస్త దూరం వెళ్లి తిరిగి వచ్చి ఉంటే సరిపోయేది. కానీ వేటపై అతడు చూపించిన అతి ఉత్సాహాం ప్రాణాల మీదకు వచ్చింది. అడవిలో తప్పిపోయి దాదాపు నెల రోజుల పాటు నరకయాతన అనుభవించాడు. మూత్రం తాగుతూ, కీటకాలను తింటూ ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చాడు. చివరకు రెస్య్కూ టీమ్ కంటబడి ప్రాణాలతో బయట పట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బొలీవియాకు దేశానికి చెందిన 30 ఏళ్ల జోనాటన్ అనే యువకుడు జనవరి 25న కొంతమంది స్నేహితులతో కలిసి అమెజాన్ అడవుల్లో వేటకు వెళ్లాడు. అలా వేటకు వెళ్లిన సమయంలో బొలీవియర్స్ సమీపంలో పర్వత ప్రాంతంలో జోనాటన్ తప్పిపోయాడు. అలా స్నేహితుల నుంచి తప్పిపోయి అమెజాన్ అడవుల్లో ఒక నెలపాటు చిక్కుకుపోయాడు. అక్కడ తనకు తినడానికి ఆహారం, తాగడానికి పానీయాలు లేకుండా పోయానని తెలిపాడు. అమెజాన్ అడవుల నుంచి బయటపడే మార్గం దొరకక నెల రోజుల పాటు పిచ్చి వాడిలా తిరిగాడు.
చివరికి రెస్క్యూ టీమ్ కంటబడి.. రక్షించబడ్డాడు. తిరిగి మానవజీవితంలో అడుగు పెట్టాడు. ఈ క్రమంలో నెల రోజుల పాటు అతడు సజీవంగా ఉండటానికి గతంలో అతడు నేర్చుకున్న కొన్ని విద్యాలు ఉపయోగపడ్డాయి. జోనాటన్ తన జాతీయ సైనిక విభాగంలో పనిచేస్తున్న సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలు మరియు టెలివిజన్‌లో సర్వైవల్ ప్రోగ్రామ్‌లను చూడటం వల్ల అతను సజీవంగా ఉండటానికి సహాయపడిందంట. ఇక జన్మలో వేటకు వెళ్లలని, తనకు పునర్జన్మ నిచ్చిన దేవుడికి జోనాటన్ కృతజ్ఞతలు తెలిపాడు.
అంతేకాక ఈ నెల రోజుల పాటు తనను తాను బతికించుకోవడం కోసం ఏం చేశాడో తెలిపాడు. కీటకాలు, వానపాములను తింటూ, మూత్రం తాగుతూ బతకాల్సి వచ్చిందని అతడు తెలిపాడు. అంతేకాక అడవిలో దొరికే పండ్లను తినేవాడినని చెప్పాడు. అంతేకాదు వర్షం కోసం తాను దేవుడిని ప్రార్థించానని, వర్షం పడకపోతే తాను చనిపోతానని అని భావించినట్లు తెలిపాడు. తనను తాను హైడ్రేట్ గా ఉంచుకోవడానికి తన రబ్బరు బూట్లలో వర్షపు నీటిని సేకరించానని జోనాటన్ చెప్పాడు. వర్షాలు తగ్గి.. ఎండలు మండిపోతుంటే.. బలవంతంగా మూత్రం తాగి బతికినట్లు పేర్కొన్నాడు. అలా వన్య ప్రాణుల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ 31 రోజుల తరువాత తనకు 300 మీటర్ల దూరంలో ఉన్న రెస్క్యూ టీమ్ చూశాడు.
వెంటనే సాయం కోసం కేకలు వేస్తూ వారి వైపు వెళ్లాడు. వారు ఎట్టకేలకు జోనాటన్ ను అడవుల్లో నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఈ సమయంలో.. అతడు బరువు 17 కిలోలు మేర తగ్గాడు. అతడిని అమెజాన్ అడవి నుంచి బయటకు తెచ్చిన తర్వాత, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సమాచారం. ఇక భవిష్యత్తులో ఎప్పుడు వేటకు వెళ్లనని.. ఇక నుంచి దేవుడి గీతాలు వింటూ కాలక్షేపం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరి… ఓ వ్యక్తి కేవలం మూత్రం తాగుతూ, కీటకాలను తింటూ బతకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.