ప్రపంచంలోనే అత్యంత ఘోర ప్రమాదం ఆదివారం సంభవించింది. ఒకేసారి 100 మందికి పైగా గుండెపోటు వచ్చింది. ఒకే ఘటనలో దాదాపు 149 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఈ దుర్ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల్లోకి వళ్తే.. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఈ ఘటన జరిగింది. ప్రతి ఏడాది జరిగే హాలోవీన్ వేడుకల్లో ఈ ప్రమాదం సంభవించింది. హాలోవీన్ వేడుకల్లో భాగంగా ఓ ఇరుకైన సందు నుంచి వెళ్తుండగా తొక్కిసలాట జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరణాల్లో అత్యధిక శాతం గుండెపోటుతోనే సంభవించినట్లు తెలిపారు. అంతేకాకుండా చాలా మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారన్నారు.
లీసుర్ జిల్లాలోని ఇటావోన్ లో ఈ తొక్కిసలాట జరగ్గా.. క్షతగాత్రులను సియోల్ లోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే మొత్తం 400 మంది అత్యవసర సిబ్బంది, 140 వాహనాలను అధికారులు రంగంలోకి దింపారు. దాదాపు చాలా మందిని ఈ అత్యవసర సిబ్బంది కాపాడగలిగారు. మరింత ప్రాణనష్టం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ హాలోవీన్ వేడుకల్లో దాదాపు లక్ష మంది వరకు పాల్గొన్నారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనకు కారణం ఏంటని విచారించగా.. హాలీవీన్ జరిగే ప్రాంతంలోని ఓ బార్ కు గుర్తుతెలియని సెలబ్రిటీ వచ్చాడని వారికి తెలిసింది.
#BREAKING: #SouthKorea‘s fire department said 81 people have breathing problems after the #stampede at Itaewon in #Seoul, South Korea Saturday night when over 100 thousand revellers crammed into the place for #Halloween celebrations.#SeoulStampede pic.twitter.com/QwyWcYTj43
— Media Warrior (@MediaWarriorY) October 29, 2022
అతడిని చూసేందుకు ప్రజలు అంతా ఒక్కసారిగా ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఈ తొక్కిసలాట ఘటన ఎంతో దురదృష్టకరమని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందిచాలని, క్షతగాత్రులకు అన్ని రకాల వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ ఘటనపై ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. గాయపడినవారు త్వరిత గతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దక్షిణ కొరియా ప్రజలకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
WARNING: GRAPHIC CONTENT – At least 149 people, mostly teenagers and young adults in their 20s, were killed in South Korea when a crowd celebrating Halloween surged into an alley in a night-life area of Seoul https://t.co/ZBB3cKhxO5 pic.twitter.com/evlVibGuUw
— Reuters (@Reuters) October 29, 2022
®️🔝®️⚡️🇰🇷South Korea: At least 149 people had died, trampled to death in Seoul South Korea. On the afternoon of the 29th, a large-scale accident occurred as a crowd gathered around Itaewon-dong, Yongsan-gu, Seoul. pic.twitter.com/BtuARCIeRF
— worldnews24ru (@worldnews24ru1) October 30, 2022
Horrible scenes from South Korea#지구에서년지성아_환영해 #southkorea #korea #halloween #Itaewon
NSFW pic.twitter.com/0enMWoCRD1
— 악마 (@mashsomethingyo) October 30, 2022