లండన్‌లో బోనాల జాతర నిర్వహించారు. బోనాల జాతరలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. వారి అనుభూతుల్ని ఫొటోల ద్వారా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత దంపతులు ఈ మధ్య ఫారిన్ ట్రిప్పులు వేస్తున్నారు. వారి ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఈవెంట్స్ చేయడానికి ఈ మధ్య విదేశాలకు వెళుతున్నారు. తన భార్య సుజాతను తీసుకుని వెళుతున్నారు. లండన్‌లో వరంగల్‌కు చెందిన NRI ఫోరమ్.. గత పదేళ్లుగా బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తుంది. అయినప్పటికీ ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. అందుకుగాను యాంకర్, నటి తెలంగాణ మహిళ జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దిగిన ఫొటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
పూర్తి విరాలేంటో తెలుసుకుందాం..
లండన్ లో జరిగిన బోనాల జాతర నిర్వహించిన సందర్భంగా ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఎన్నో ఏళ్లుగా లండన్‌లో నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఎప్పటిలా కాకుండా మరింత ఘనంగా జరుపుతున్నాం. మరింత ఉత్సాహాన్ని నింపడానికి హైదరాబాద్ నుండి రాకింగ్ రాకేష్, సుజాత ఇక్కడికి రావడం ఆనందించదగ్గ విషయం’ అని తెలిపారు. రాకింగ్ రాకేష్ మిమిక్రీతో పాపులర్ అయ్యారు. ‘జబర్దస్త్’ ప్రొగ్రామ్స్ చేస్తున్నారు. ఇటీవల అమెరికా న్యూజెర్సీలో నాట్స్ కార్యక్రమానికి కూడా హాజరైయ్యారు. తర్వాత లండన్ లో బోనాల వేడుకలు తమదైన స్కిట్లు, మిమిక్రీ షోలు చేసి అందరిని అలరించారు.
ఈ సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. వరంగల్ NRI ఫోరమ్ తో తనకు మంచి అనుబంధం ఉందని.. కరోనా సమయంలోనే కాకుండా.. మామూలు సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి తన ద్వారా డబ్బు పంపి సహకారం అందించారని అన్నారు. చాలా మంది చిన్నారుల చదువు, వైద్యానికి సహకరించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సారి బోనాల వేడుకలో తాము భాగం కావాలని వరంగల్ NRI ఫోరమ్ కోరగా.. గతంలో వారు చేసిన సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్ షో చేశామని.. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశామన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జనరల్ సెక్రటరీ రమణ, వైస్ ప్రెసిడెంట్ నాగ ప్రశాంతి, ప్రవీణ్ బిట్ల, కమల తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.