ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన వార్తలను తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీలకు సంబంధించిన సినిమాలు, ప్రేమ వ్యవహారం, వివాదాలు, అరెస్టులు వంటి వాటిని తెలుసుకునేందుకు జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తుంటారు. ఇంక అలాంటి వార్త వచ్చిందంటే చాలు.. కొందరు దానిపైన ఒకటే చర్చలు చేస్తుంటారు. అలానే ఇటీవల పలు వివాదాలు, ఇతర కేసుల కారణంగా కొందరు సెలబ్రిటీలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. మరికొందరు పలు కేసుల్లో జైలుకు వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ ప్రముఖ హీరోయిన్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆమె నిరసన తెలిపిన కారణంగా అరెస్టు చేశారు. ఇంతకి ఆ ప్రముఖ నటి ఎవరో, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఇరాన్ కు చెందిన ప్రముఖ నటి తారానేహ్ అలీ దూస్తిని పోలీసులు అరెస్టు చేశారు. గత మూడు నెలల నుంచి ఇరాన్ దేశంలో హిజాబ్ కు వ్యతిరేకం ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే ఆందోళనకారులపై ఇరాన్ ప్రభుత్వం అణచివేత ధోరణి కొనసాగిస్తోంది. హిజాబ్ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారికి ఇరానీ నటీ తారనేహ్ అలీదూస్తి మద్దతు తెలిపారు. అంతేకాకగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈక్రమంలో ప్రభుత్వ అణచివేతపై నిరసనగళం ఎత్తిన కారణంగా ఆమెను అరెస్టు చేశారు. హిజాబ్ ఆందోళనల విషయంలో అబద్ధాలను వ్యాప్తి చేరన్న ఆరోపణలపై పోలీసులు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్ లో అనేక సినిమాలో నటించి.. స్టార్ హీరోయిన్ గా అలీదూస్తి కొనసాగుతున్నారు. అక్కడ ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం ఉంది. అయితే తాజాగా ఆమె అరెస్టుతో అలీదూస్తీ అభిమానులు.. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాట్లు సమాచారం. మరీ. ఇరాన్ లో జరుగుతున్న ఆందోళనపై, నటి అరెస్టు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.