అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ విడాకులు విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వారి విడాకులు విషయంతో పాటు.. భాగస్వామికి చెల్లించే భరణం కూడా చర్చనీయాంశంగా మారింది. వీరి విడాకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. తాజాగా ఈ కోవలోకి దుబాయ్ యువరాణి చేరారు. భర్త నుంచి విడాకుల అనంతరం ఆమె 733 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో చెప్పాలంటే.. 55,44,80,41,550 కోట్ల రూపాయలు భరణంగా పొందనున్నారు. ఆ వివరాలు..
దుబాయ్ పాలకుడు, షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ తన భార్య యువరాణి హయా బింట్ గత కొంత కాలం నుంచి విడిగా ఉంటున్నారు. రాజకుటుంబంలో ఉండలేనంటూ.. తన ఇద్దరు పిల్లలను తీసుకుని హయా లండన్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ వివాదం లండన్ కోర్టు పరిధిలో ఉంది.
ఈ క్రమంలో తన మాజీ భార్యతో పాటు వారి ఇద్దరు పిల్లలపై కస్టడీ పోరును పరిష్కరించడానికి 733 మిలియన్ డాలర్లు భరణంగా చెల్లించాలని లండన్ లోని హైకోర్టు షేక్ మహమ్మద్ ను ఆదేశించింది. ఈ మొత్తంలో పావు భాగాన్ని మూడు నెలల వ్యవధిలో హయా అకౌంట్లో జమ చేయాలని ఆదేశించింది. మిగతా మొత్తాన్ని ఏడాదిలోపు పిల్లల పేరు మీద జమ చేయాలని లండన్ కోర్టు సూచించింది.
