నైజీరియాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 31 మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏడుగుకు గాయపడ్డట్లుగా సమాచారం. ఇక స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్‌కోర్ట్ సిటీలో ఉన్న కింగ్స్ అసెంబ్లీ అనే చర్చిలో శనివారం నిర్వాహకులు డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా బహుమతులు, ఆహార పదార్థాలు పంచిపెట్టేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ నేపథ్యంలోనే జనాలంతా పెద్ద సంఖ్యలో తోసుకుంటూ వచ్చారు. దీంతో అందరి మధ్య తోపులాట చేసుకుంది. ఒకరి మీద ఒకరు తోసుకుంటూ ఎగబడే ప్రయత్నం చేయబోయారు. చర్చిలో ఉన్న జనాలంతా గేట్లను తోసుకుంటు బయటకు రావడంతో ఒక్కసారిగా భారీగా తొక్కిసలాట జరిగింది. దీంతో వెంటనే స్పందించి చర్చి నిర్వాహకులు గాయపడ్డవారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Hyderabad: పెళ్లైన 6 నెలలకే బయటపడ్డ భర్త భాగోతం.. తట్టుకోలేక వైద్యురాలు ఏంచేసిందంటే..?ఈ ప్రమాదంలో సుమారుగా 31 మంది మరణించగా ఏడుగురికి తీవ్రగాయాలైనట్లు నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రతినిధి ఒలుఫెమి అయోదెలె తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండడం విశేషం. ఇక సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.