Viral Video: అందరు మగాళ్లలాగే అతడు కూడా ఎన్నో ఆశలతో పెళ్లనే బంధంలోకి అడుగుపెట్టాడు. రెండు, మూడు రోజులు గడిచాయి. తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి అతడికి నమ్మలేని నిజం తెలిసింది. ఆమె వేరే వ్కక్తితో ఎఫైర్ పెట్టుకుందని తేలింది. ఆమె ఏకాంతంగా వేరే వ్యక్తితో గడుపుతున్న వీడియో కూడా అతడికి అందింది. అప్పుడా వరుడు భార్యకు దిమ్మతిరిగి పోయే షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని ఫుజియాన్‌కు చెందిన ఓ వ్యక్తికి 2019లో అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లయింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి రిసెస్షన్ జరుగుతుందనగా..
వరుడికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. తన భార్యకు ఇదివరకే వేరే వ్యక్తితో సంబంధం ఉందని.. వీడియోతో సహా తేలింది. దీంతో అతడు కుమిలిపోయాడు. తనను దారుణంగా మోసం చేసిన భార్యకు సరైన విధంగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. పెళ్లి రిసెస్షన్ జరిగే రోజు రానే వచ్చింది. రిసెస్షన్ మధ్యలో తన భార్యకు సర్‌ప్రైజ్ అని చెప్పాడు. ఆమె ఆ సర్‌ప్రైజ్ ఎంటా అని ఎదురుచూడసాగింది. స్టేజి మీద ఉన్న ప్రొజెక్టర్ తెరపై తన బూతు వీడియో ప్రసారం అయ్యేసరికి కంగుతింది.
భర్తపై కోప్పడింది. పూల బుకేను ఆవేశంతో అతడిపై విసిరింది. ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు అయ్యింది. తాజాగా, అందుకు సంబంధించిన వీడియో మరో సారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, తనను మోసం చేసిన భార్యపై భర్త రివేంజ్ తీర్చుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Viral Video: వీడియో: పోలీసులకు నాసిరకం భోజనం.. వెక్కివెక్కి ఏడ్చిన కానిస్టేబుల్!