ఒక దేశం నుంచి మరో దేశానికి బంగారం, వజ్రాలు అక్రమంగా రవాణా చేస్తున్నపుడు ఎయిర్‌పోర్టులో చిక్కటం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తరచుగా లక్షలు, కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువులు పట్టుబడుతూ ఉంటాయి. ఇదంతా ఎప్పుడూ జరిగేదే.. కానీ, కొన్ని కొన్ని సార్లు వింత, విచిత్ర, భయానక సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మెక్సికోలోని ఎయిర్‌పోర్టులో వెలుగుచూసింది. ఓ పార్శిల్‌లో ఎకంగా నాలుగు పుర్రెలు కనిపించాయి. దీంతో అధికారులు షాక్ తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడు రోజుల క్రితం ఎయిర్ పోర్ట్ ఇన్ సెంట్రల్ మెక్సికోకు ఓ పార్శిల్ వచ్చింది. ఆ అట్టె పెట్టె పార్శిల్ మిచోఒకాన్ నుంచి సౌత్ కరోలినాకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు దానికి స్కానింగ్ నిర్వహించారు.
అందులో ఓ అల్యూమినియం ర్యాపర్ చుట్టిన నాలుగు పుర్రెలు వెలుగు చూశాయి. అవి పుర్రెలు అని తెలియగానే అధికారులు షాక్ తిన్నారు. వాటిపై విచారణ చేపట్టారు. సాధారణంగా పుర్రెల్ని ఇలా పార్శిల్‌లో పంపటానికి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలని, లేకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, పార్శిల్‌లో నాలుగు పుర్రెలు కనిపించిన ఈ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.