వారిద్దరికీ ఆరేళ్ళ క్రితం పెళ్లయ్యింది. కొన్నేళ్ల పాటు వీరి కాపురం బానే సాగింది. విడాకులు కూడా తీసుకున్నారు. కట్ చేస్తే భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. కొన్ని రోజులకు అతను చనిపోలేదని తెలిసి షాక్ అయ్యింది. అంతేకాదు వేరే అమ్మాయితో కలిసి జీవిస్తున్నాడని తెలిసింది. దీంతో ఆ భార్య ఏం చేసిందంటే?
భార్యాభర్తల మధ్య గొడవ వస్తే మూడో వ్యక్తి ఆపే ప్రయత్నం చేస్తారు. అదే వీరి జీవితంలోకి మూడో వ్యక్తి వస్తే గొడవ అవుతుంది. విడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ మూడో వ్యక్తి మూడ్ ని బట్టి దంపతుల కాపురం అనేది నిలబడుతుంది. కానీ మూడో వ్యక్తి రావడం, ఆ కారణంగా గొడవ జరిగి దంపతులు విడిపోవడం వంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇంట్లో భార్య చేసిన పూరీ నచ్చదు గానీ బయట ఆవురావురమంటూ పానీపూరీ తింటారు కొందరు భర్తలు. ఇంట్లో అందమైన భార్య ఉండగా.. బయట వేరే ఆవిడతో సంబంధం పెట్టుకుంటారు. అయితే ఆ సంబంధాన్ని భార్యకు భయపడకుండా సాగించడం కోసం కట్టుకున్న ఇల్లాలిని కడతేరుస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం కొంచెం డిఫరెంట్.
ప్రియురాలితో కలిసి జీవించాలని తనను తానే చంపేసుకున్నాడు. అంటే చనిపోయినట్లు భార్యను నమ్మించి.. వేరే ప్రియురాలితో ఉంటున్నాడు. ఆ విషయం తెలిసిన భార్య ఇదెక్కడి మోసం అంటూ లబోదిబోమంటోంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అనెస్సా రోస్సీ అనే మహిళ తన భర్త టిమ్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. 5 నెలల క్రితం చనిపోయినట్లు నమ్మించి.. వేరే మహిళతో ఉంటున్నాడని ఆమె వాపోయింది. మెక్సికోలోని వేరే మహిళతో కాపురం ఉంటున్నాడని తెలిసిన రోస్సీ షాక్ కి గురైంది. తాము విడిపోయిన 5 నెలల తర్వాత తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని టిక్ టాక్ వీడియోలో చూశానని ఆమె పేర్కొంది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిశాక అంత్యక్రియలకు వెళ్దామనుకుంటే అతని కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదని ఆమె వెల్లడించింది. దీంతో భర్త నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఫిక్స్ అయిపోయింది.
కట్ చేస్తే అతను బతికే ఉన్నాడని.. మెక్సికో నగరంలో వేరే మహిళతో ఉంటున్నాడని తెలిసింది. భర్త అంత్యక్రియలను ఫ్లోరిడాలో నిర్వహించారు. తన విడిపోయిన భర్తకు నివాళులు అర్పించాలని బలమైన కోరిక ఉన్నప్పటికీ.. విడాకులు తీసుకున్న కారణంగా రోస్సీని అనుమతించలేదు. దీంతో ఆమె విడిపోయిన భర్తను చివరి చూపు చూడలేకపోయినందుకు బాధపడింది. అయితే తన మాజీ భర్త చనిపోలేదు, చనిపోయినట్టు నాటకం ఆడి వేరే మహిళతో ఉంటున్నాడని తెలియడంతో ఆమె బాధపడింది. తనను మోసం చేసిన మాజీ భర్త, అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రోస్సీ చేసిన ఆరోపణలను ఆమె మాజీ భర్త ఖండించాడు. తానేమీ నకిలీ ఆత్మహత్యను సృష్టించలేదని.. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని కొట్టిపడేశాడు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.