Hero Surya: టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ ఉంటుంది. సూర్య మొదటినుంచి నటనకు ప్రధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వచ్చారు. విలక్షణ నటుడనే పేరును తెచ్చుకున్నారు. 2014-2018 మధ్య కాలంలో కమర్శియల్ సినిమాలు తీసి చెయ్యి కాల్చుకున్నారు. వరుస అపజయాలు మూటగట్టుకున్నారు. ఇలా అయితే కుదరదని భావించి, మళ్లీ పాత దార్లోకి వచ్చేశారు. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘జై భీమ్’తో అదరగొట్టారు. తర్వాత వచ్చిన ‘ఈటీ’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘‘వాడివాసల్’’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ పల్లె టూరి వ్యక్తిగా కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో ఎద్దుతో కొన్ని సీన్లు ఉండబోతున్నాయంట. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎద్దుతో కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సూర్య స్లీవ్‌లెస్ టీషర్ట్, షాట్‌తో ఎంతో సింపుల్‌గా కనిపించారు. రోడ్డుపై ఎద్దును తోలుకుంటూ నడుస్తున్నారు. తమిళ ప్రజలకు తమిళ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సూర్య ‘వాడివాసల్’ సినిమాతో పాటు ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోగ్రఫీ ‘‘ రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’’లోనూ నటిస్తున్నారు. మరి, సూర్య సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : జూ.ఎన్టీఆర్ తల్లిపై యశ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.