గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము (గాడిద) పాలు. చిన్నప్పుడు చదువుకున్న వేమన శతకం ఇది. కానీ.., మారిన నేటి పరిస్థితిల్లో ఈ వేమన శతకం పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇక రానున్న కాలంలో ఖరము (గాడిద) పాలు గరిటెడైనను చాలు. కడివెడైననేమి గంగిగోవు పాలు అని పాడుకోవాల్సి వస్తుందేమో. అవును.. ఇప్పుడు గాడిద పాలకి అంతటి డిమాండ్ ఏర్పడింది. మరి.., ఒక్కసారిగా గాడిద పాలకి ఇంతటి డిమాండ్ ఎందుకు ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర ఉమర్గా పట్టణంలో గాడిద పాలకు ఒక్కసారిగా భలే గిరాకీ వచ్చేసింది. లీటరు గాడిద పాలు రూ.10 వేల వరకు అమ్ముతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గాడిద పాలల్లో విటమిన్లు, ఖనిజాలతో పాటు ట్రేస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో.., ఈ పాలు టైప్ II డయాబెటిస్ చికిత్సకు ఉపయోగపడుతుందన్న వాదన ఎక్కువైంది.
నిజానికి ఎంత ఆరోగ్యవంతమైన గాడిద అయినా రోజుకి లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేయగలదు. ఈ పాలల్లో వ్యాధి కారకాలు అస్సలు ఉండవు. పైగా.. ఆవు పాలతో పోలిస్తే, అలెర్జీని కలిగించే అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో., ఇప్పుడు మహారాష్ట్రతో పాటు, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో గాడిద పాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హర్యానా హిస్సార్‌లో త్వరలోనే గాడిదల పాల డెయిరీని ఎన్‌ఆర్‌సీఈ ప్రారంభించనుంది. ఇందుకోసం ఎన్‌ఆర్‌సీఈ హలారి జాతి గాడిద నుంచి సేకరించిన పాలతో డెయిరీని తెరిచేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం గుజరాత్ లో లభించే హలారి జాతి గాడిదలను సైతం ఆర్డర్ చేసింది. ఇలా అన్నీ అనుకున్నట్టు జరిగితే.., రాబోయే కాలంలో గాడిదలని పెంచడం కూడా ఓ పెద్ద బిజినెస్ కాబోతుంది అనమాట. మరి.. చూశారు కదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.