రాజకీయ నాయకుడికైనా, సినీ సెలెబ్రెటీకైనా బాడీ గార్డ్ లేకపోతే వాళ్ళు ఒక్క నిమిషం కూడా బయట ప్రపంచంలో జీవించలేరు. ప్రతి ఒక్కరు వారి వారి బాడీ గార్డ్స్ ను కంటికి రెప్పలా చూసుకుంటారు. అందులో భాగంగానే బాలీవుడ్ నటి దీపికా పదుకునేకు కూడా జలాల్ అనే ఒక బాడీ గార్డ్ ఉన్నాడు. అతడు దీపికా ఎక్కడకు వెళ్లినా ఆమెను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు ఆమె సకల సౌకర్యాలు మొత్తం అతడి పర్యవేక్షణలోనే జరుగుతాయట. అతడిని దీపికా సొంత సోదరుడిలా భావించి ప్రతి ఏడాది రాఖీ కూడా కడుతుందట. అతి తక్కువ జీతం నుండి అతడు దీపిక వద్ద పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఏడాదికి 80 లక్షల జీతంతో పాటు పండగలకు ప్రత్యేక రోజులకు బహుమానాలతో కలిపి ఏడాదికి కోటి వరకు దక్కించుకుంటున్నాడట. ఒక బాడీ గార్డ్ కు ఇంత జీతం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఉంటుందా అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
గతంలో అతడి శాలరీ 80 లక్షలు కాగా ఇప్పుడు మరొక 20 కలుపుకుని కోటి రౌండ్ ఫిగర్ ఇస్తుందట. ఈమధ్య దీపికా బాలీవుడ్ ధాటి హాలీవుడ్ లో కూడా తన ప్రస్థానం అప్రతిహతంగా దూసుకెళ్తోంది. జాలాల్ కు ఇల్లు ను కూడా బహుమానంగా ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దీపిక పదుకునే ప్రస్తుతం బాలీవుడ్ అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న కారణంగా తన బాడీ గార్డ్ కు అత్యధికంగా జీతం ఇస్తుంది. తన స్టార్ స్టేటస్ కు ఇది నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. ఆ మాత్రం నమ్మకస్తుడైన సేవకుడి కోసం దీపికా ఆమాత్రం ఖర్చు పెట్టడంలో తప్పులేదులే అంటున్నారు.
ఎంతో మంది కుర్రాళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగాల పేరుతో ఎంత గొడ్డుచాకిరి చేసిన ఎదుగూబొదుగూ లేకుండా అక్కడే ఉంటారు. ఇలాంటి బాడీ గార్డ్ ఉద్యోగం ఒక్క ఏడాది చేస్తే లైఫ్ సెటిల్ అయిపోవచ్చని కొంతమంది సెటైర్స్ వేస్తున్నారు.