ఇంటర్నేషనల్ డెస్క్- ప్రమాదాలు ఎప్పుడూ చెప్పి రావు. ఒక్కోసారి చిన్న చిన్న పనులే ప్రాణాల మీదకు తెస్తాయి. ప్రమాదం పొంచి ఉందని తెలియక మనం అందులో చిక్కుకుని పోతాం. ఇదిగో చైనాలో ఇలాగే చిన్న నిర్లక్ష్యం కాస్త ఓ పసిపాప ప్రాణం పోయేంత ప్రమాదానికి దారితీసింది. ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్ బిగించేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడి చూసిన దృష్యం గుండెలదిరేలా చేసింది.
గదిలో ఫ్యాన్ బిగించాల్సిన చోట ఓ మనిషి తల వేలాడుతూ కనిపించింది. భయంతో తగ్గరకు వెళ్లి చూస్తే అది తన కన్న కూతురు తల అని అర్ధమయ్యే సరికి ఆ తండ్రి భయంతో అరిచాడు. చైనా దేశంలో గుయిజోకు చెందిన పుడ్డింగ్ కౌంటీలో ఒక ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఒక గదిలో ఎక్స్ట్రాక్ట్ ఫ్యాన్ బిగించడం కోసం ఓ చోట 8 అంగుళాల రంధ్రం చేశారు.

అక్కడ రంధ్రం ఎందుకు చేశారో తెలియని ఆ ఇంటి యజమాని కూతురు దాని లోంచి కిందకు తొంగి చూడటానికి ప్రయత్నించింది. అంతే అనుకోకుండా ఆ చిన్నారి తల ఆ కన్నంలో ఇరుక్కుపోయింది. అంతే బయటకు రాలేక ఆ పాప గింజుకుంటూ ఉండగా, ఎక్స్ ట్రాక్ట్ ఫ్యాన్ బిగించేందుకు తండ్రి గదిలోకి వెళ్లాడు. అంతే వెంటనే కూతురును ఆ రంద్రం నుంచి బయటకు తీయడానికి అతను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది.
ఇక చేసేది లేక ఫైర్ సర్వీసెస్ కు ఫోన్ చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్లు కూడా పాపను బయటకు తీసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. బాగా ఆలోచించిన తరువాత వంట నూనె తీసుకొచ్చి ఆ రంద్రం చుట్టూరా పోశారు. ఆ తర్వాత మెల్లిగా ప్రయత్నిస్తే ఆ పాప తల బయటకు వచ్చేసింది. హమ్మయ్య అని అప్పుడు అంతా రిలాక్స్ అయ్యారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, బాగా వైరల్ అవుతోంది.
