నేడు తల్లిదండ్రులు ఆలోచనలు మారుతున్నాయి. పిల్లల ఇష్టా ఇష్టాలకు విలువలు ఇస్తున్నారు. తాము ఈ అబ్బాయి/అమ్మాయిని ప్రేమించాం అని చెబితే ముందు మంకు పట్టు పడతారు కానీ.. ఆ తర్వాత పిల్లల కోసం వారి పెళ్లికి అంగీకరిస్తున్నారు.
ప్రేమించుకున్నాం అంటే కచ్చితంగా పెద్దలు ఆ బంధాన్ని ఒప్పుకోరు. ఇక పెళ్లికి మాత్రం అంగీకరిస్తారా. కానీ నేడు తల్లిదండ్రులు ఆలోచనలు మారుతున్నాయి. పిల్లల ఇష్టా ఇష్టాలకు విలువలు ఇస్తున్నారు. తాము ఈ అబ్బాయి/అమ్మాయిని ప్రేమించాం అని చెబితే ముందు మంకు పట్టు పడతారు కానీ.. ఆ తర్వాత పిల్లల కోసం వారి పెళ్లికి అంగీకరిస్తున్నారు. కానీ ఆ తర్వాత తమ కాపురాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే భార్యా భర్తలే. ఇక్కడే తడబడుతున్నారు ఆ ప్రేమ జంట. సినిమాల్లో చూపించిన పెళ్లి తర్వాత లైఫ్ సూపర్ అని భ్రమల్లో బతికేస్తున్న ప్రేమ కథలు.. చివరకు విషాదాలుగా ముగుస్తున్నాయి. తాజాగా తాడిపత్రిలో నూతన వధూవరుల విషయంలో ఇదే జరిగింది.
ప్రేమించారు.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అంత సవ్యంగా సాగిపోతున్న సమయంలో భార్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత భర్త కూడా రైలు కింద పడే బలవర్మణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా తాడిప్రతిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి మండలం చిన్న పోడమలకు చెందిన మంజునాథ్.. పుట్లూరు మండలం గురుగు చింతలపల్లికి చెంది రమాదేవి ప్రేమించుకున్నారు. వీరు పెళ్లి చేసుకోవాలని భావించి.. తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు కూడా అంగీకారం తెలపడంతో ఆరు నెలల క్రితం పెళ్లైంది. కాపురం కూడా మూడు పువ్వులు, ఆరు కాయాలుగా సాగిపోతుంది అనుకునే సమయంలో ఏమైందో ఏమో తెలియదు కానీ సోమవారం రమాదేవి ఆత్మహత్య చేసుకుంది.
తాడిపత్రి మండలం చల్లవారిపల్లి దగ్గర రైలు కిందపడి ప్రాణాలను తీసుకుంది. భార్య ఆత్మహత్య గురించి తెలుసుకున్న భర్త మంజునాథ్ కూడా తన స్వగ్రామానికి సమీపంలో రైలు ట్రాకుపై శవమై కనిపించారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా, వరకట్న వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని రమాదేవి తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి.. ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.