అమ్మను మించిన దైవం లేదంటారు. భర్త, పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది తల్లి. ముఖ్యంగా ఆడ పిల్లలకు అన్ని తానై చూస్తుంది. వారి మీద ఈగ కూడా వాలనివ్వదు. పరాయి కళ్లు పడితేనే ఓర్వలేకపోతుంది తల్లి.
అమ్మను మించిన దైవం లేదంటారు. భర్త, పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది తల్లి. ముఖ్యంగా ఆడ పిల్లలకు అన్ని తానై చూస్తుంది. వారి మీద ఈగ కూడా వాలనివ్వదు. పరాయి కళ్లు పడితేనే ఓర్వలేకపోతుంది తల్లి. పెళ్లీడు వచ్చే వరకు కంటికి రెప్పలా కాచి వారినో అయ్య చేతిలో పెట్టే బాధ్యతను తీసుకుంటుంది. ఆ తర్వాత వారి సంసారాలు బాగుండాలని సలహాదారునిగా కూడా మారుతుంది. కానీ ఈ తల్లి.. అమ్మతనానికే మాయని మచ్చగా మారింది. కడుపున పుట్టిన బిడ్డలను.. తండ్రి వరుసయ్యే వ్యక్తితో సంసారం చేయించింది. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి పెదపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త అనారోగ్యంతో 2007లో చనిపోయాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పిల్లలు చిన్నవాళ్లు కావడంవతో సాకేందుకు కష్టమవ్వడంతో పుట్టా సతీష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తనకు పిల్లలు కావాలని రెండో భర్త ఒత్తిడి తెచ్చాడు. లేకుంటే తాను మరో పెళ్లి చేసుకుంటానని హింసించడం మొదలు పెట్టాడు. అయితే అప్పటికే ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయిపోవడంతో అతడి కోరికను తీర్చేందుకు కడుపున పుట్టిన బిడ్డలను బలి చేసింది కసాయి తల్లి. ఎనిమిదో తరగతిలో ఉండగానే పెద్ద కుమార్తెతో బలవంతంగా కాపురం చేయించింది. అయితే ఆమె గర్భవతి కాగా, అబార్షన్ చేయించింది. ఆ తర్వాత అతడి వద్దకు పంపగా, గర్భవతిని చేశాడు. కుమార్తె ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఆ పాప తమ బిడ్డగా భర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు.
ఆడ పిల్ల పుట్టడంతో మగపిల్లవాడు కావాలని సతీష్ అనడంతో రెండో కుమార్తెను అతడి వశం చేసింది.ఆమెకు గత ఏడాది మృతశిశువు జన్మించాడు. దీంతో ఆ బిడ్డను కాలువలోపడేసింది తల్లి. ఈ విషయం బయటకు పొక్కకూడదని పిల్లలకు కూడా తల్లే పురిడి పోసింది. అయితే ఇటీవల సతీష్, ఈ పిల్లల తల్లికి మధ్య గొడవలు జరగడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తనను మారు తండ్రి చేస్తున్న అఘాయిత్యం గురించి చిన్న కుమార్తె తన మేనమామ దగ్గర చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కసాయి తల్లితో పాటు రెండవ భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కుమార్తెలిద్దరూ గర్భవతులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు మైనర్లను సంరక్షణ కేంద్రానికి తరలించారు. పోక్సో చట్టం కింద దిశ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.