ఇస్లాం దేశాల్లో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించే దేశం సౌదీ అరేబియా. ఈ దేశంలో అన్యమత ప్రచారం, ఇతర మతాల పండుగలు నిషేధం. ఒకవేళ పండుగలు జరుపుకొన్నా దొంగతనంగా బిక్కుబిక్కుమంటూ చేసుకోవాల్సిన పరిస్థితి సౌదీ అరేబియాలో నెలకొంది. ఇతర మతాల పండుగలు జరుపుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేసి మహిళలు, చిన్నారులను సైతం అరెస్టు చేసిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో చరిత్రలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలోని భారతీయ దౌత్యకార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులు ప్రముఖ పాత్ర పోషించడం మరో విశేషం.
అత్యున్నత స్థాయి దౌత్యవేత్త కాన్సుల్ జనరల్ మోహమ్మద్ షాహీద్ ఆలం చొరవకు తోడు యువరాజు మోహమ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన సంస్కరణల్లో భాగంగా సౌదీలో తొలిసారిగా ఈ వేడుకను బహిరంగంగా నిర్వహించారు. జెద్దా నగరంలోని భారత దౌత్యకార్యాలయం ప్రాంగణంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో కృష్ణ జిల్లాకు చెందిన అనిల్ కుమార్ వ్యాఖ్యతగా వ్యహరించారు. కర్నూలు జిల్లాకు చెందిన హానుక్ అభినయ్ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు.
కాన్సుల్ జనరల్ ఆలం మాట్లాడుతూ.. సౌదీలో భారతీయుల ప్రతిష్ఠను ఇనుపడించేయడంలో క్రైస్తవ నర్సుల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ క్రిస్మస్ పండుగ నిర్వహించడం, తెలుగునాట కంటే కూడా గొప్ప క్రిస్మస్ పండుగ చేసుకున్నంత గొప్ప అనుభూతి కలిగిందని అక్కడి తెలుగువారు తెలిపారు. చరిత్రలో తొలిసారి ఓ ఇస్లాంకి దేశంలో ఇతర మతాల పండుగలు నిర్వహించడం, దానికి సౌదీ అరేబియా శ్రీకారం చుట్టడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.