ఫిల్మ్ డెస్క్- సుమ కనకాల.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెర అయినా, వెండి తెర వేడుక అయినా సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల సినిమా వేడుకలైతే ఖచ్చితంగా సుమ హోస్ట్ గా ఉండాల్సిందే. అంత క్రేజ్ ఉంది సుమకు.
ఇక సుమ కేవలం బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోను బాగా సందడి చేస్తుంది. తనకు సంబందించిన చాలా విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఇదిగో ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సుమ. సరదాగా ఉన్న ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.
హోనన హోనన హూనన.. నచ్చానా.. అంటూ బాహుబలి సినిమాలో తమన్నా పాట గుర్తుంది కదా. ఆ పాటలో తమన్నా శరీరానికి మొత్తం సీతాకోక చిలుకలు వాలిపోయి ఉంటాయి. అదిగో అచ్చు అలాగే ట్రై చేసింది యాంకర్ సుమ. తన ఫాంహౌజ్ లోని తోటలో సీతాకోక చిలుకల మధ్య హోనన హోనన అంటూ సొంత గొంతుతో పాట పాడేసింది సుమ. ఐతే సుమ అలా పాడుతూ ఉంటే పక్కనే ఉన్న పక్షులు, సీతాకోక చిలుకలు ఎగిరిపోయాయి.
ఆఖరికి నెమలి సైతం చంగున అంత దూరం ఎగిరిపోయింది. దీంతో సుమ ఆశ్చర్యపోయింది. ఇదే విషయాన్ని వీడియో ద్వారా చూపించింది సుమ. ఇక ఈ వీడియోతో పాటు సుమ చేసిన కామెంట్స్ సైతం వైరల్ అవుతున్నాయి. నేను పాడితే బట్టర్ ఫ్లైలు ఎగిరిపోయాయి.. ఇక బ్యాక్ గ్రౌండ్ ఆర్ఆర్‌ను కాకులు కావ్ కావ్ అని ఇస్తున్నాయ్.. అంటూ సుమ సరదాగా చెప్పుకొచ్చారు. అన్ స్టాగ్రామ్ లో సుమ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.