స్పెషల్ డెస్క్- టెర్రస్ లవ్ స్టోరీ.. మేడ మీద ప్రేమకథ.. అవును కొన్ని ప్రేమ కధలు మేడ మీదే మొదలవుతాయి. మనకు తెలిసిన చాలా మంది లవ్ స్టోరీస్ టెర్రస్ మీదే ప్రారంభమై ఉంటాయి. మేడ మీద చదువుకోవడానికి వెళ్లినప్పుడో, బట్టలు ఆరేయడానికి వెళ్లినప్పుడు.. లేదా మరో సందర్బంలోనో ప్రేమ కధలు మొదలవుతాయి. ఇలా మేడమీదే అమ్మాయి, అబ్బాయిల చూపులు కలుస్తుంటాయి. అందుకే వీటిని టెర్రస్ లవ్ స్టోరీస్ అంటుంటాము.
ఇలాంటి టెర్రస్ లవ్ స్టోరీలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు రెడీ అయ్యారు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్, బుల్లితెరపై కూడా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఢీ డాన్స్ షో, ఇప్పుడు కామెడీ స్టార్స్‌కి జడ్జీగా ఉన్న శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంబించిన శేఖర్ మాస్టర్, స్వీయ నిర్మాణంలో టెర్రస్ అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు.
ఇక ఈ టెర్రస్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో భాగంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, కామెడీ స్టార్స్ షోలకు సంబందించిన ప్రముఖ సెలబ్రిటీలు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైపర్ ఆది, ప్రియమణి తమ టెర్రస్ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుని ప్రమోషన్ చేయగా, ఇప్పుడు హాట్ యాంకర్ అనసూయ తన టెర్రర్ లవ్ స్టోరీ చెప్తూ వీడియో విడుదల చేసింది.
ఈ వీడియోలో అనసూయ ఏంచెప్పిదంటే.. ఇప్పుడే నేను ఓ వెరైటీ లవ్ స్టోరీ క్లిప్పింగ్ చూడటం జరిగింది.. ఇది శేఖర్ మాస్టర్, దర్శకుడు సత్య క్రిష్ణ రూపొందించిన బ్యూటిఫుల్ స్టోరీ.. ఇది టెర్రస్ మీద జరిగిన స్టోరీ.. రియల్‌గా నాకు అయితే టెర్రస్ లవ్ స్టోరీ లేదు.. ఎందుకంటే నేను చాలా పద్దతిగా మేడ పైకి వెళ్లి బట్టలు తీసుకుని వచ్చేసే టైప్.. అప్పట్లో మా నాన్న మేడపైకి వెళ్లనిచ్చేవారు కాదు.. ఆయన చాలా స్ట్రిక్ట్.. అప్పట్లో మా నాన్నగారు పెద్ద పొలిటీషియన్.. ఇంట్లో ముగ్గురం ఆడపిల్లలం ఉండేవాళ్లం.. అందుకే చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు.. మేం చాలా పద్దతిగా ఉండేవాళ్లం.. అందుకే అన్‌ఫార్ట్యునేట్లీ నాకు ఎలాంటి టెర్రస్ లవ్ స్టోరీ లేదు.. ఒకవేళ ఉండి ఉంటే ఎలా ఉంటుంది అని ఈ క్యూట్ టెర్రస్ లవ్ స్టోరీని చూసి తెలుసుకోవాలని ఉంది.. అని చెప్పుకొచ్చింది.
అంతే కాదు.. నా లవ్ స్టోరీని పక్కనపెట్టండి.. మీ ఎదురింటి వాళ్లో, పక్కింటి వాళ్ల కోసమో మీరు కావాలని చుప్‌కీ చుప్‌కి పైకి వెళ్లి కావాలనే బట్టలు తడిపేసి మరీ ఎండేసిన సందర్భాలు ఉండే ఉంటాయి.. ఇలాంటివి నిజ జీవిత సంఘటనల్నే సినిమాల్లో చూపిస్తుంటారు., శేఖర్ స్టుడియోస్‌లో వస్తున్న ఈ టెర్రస్ లవ్ స్టోరీ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. మరి మీరు.. అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది అనసూయ. శేఖర్ మాస్టర్ రూపొందిస్తున్న ఈ టెర్రస్ లవ్ స్టోరీ సిరీస్ త్వరలోనే యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేసేందుకు రేడీ అయ్యారు. అంతవరకు వెయిట్ చేయండి మరి.