ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేస్తోంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు, సినిమా స్టార్స్ ఐతే తమకు సంబందించిన ప్రతి అంశాన్ని సోషల్ మీడియా ద్వార అందరికి తెలియజేస్తుంటారు. అదే సినిమా నటులైతే ఇక చెప్పక్కర్లేదు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారితో అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక సహజంగానే సినిమా వాళ్లకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ సైతం సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యామిలీలు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ను సంపాదించుకున్నాయి.
అందులో నమ్రత, ఉపాసన, స్నేహారెడ్డిలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. ప్రిన్స్ మహేష్ బాబుకు సంబంధించిన అంశాలను ఆయన సతీమణ్ నమ్రత ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఇక ఉపాసన సైతం తన అపోలో ఆస్పత్రికి సంబంధించిన విశేషాలతో పాటు, రామ్ చరణ్‌కు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి బాగా యాక్చివ్ గా ఉంటారు. అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నింటిని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది స్నేహా రెడ్డి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా స్నేహారెడ్డిని ఫాలో అవుతుంటారు.
ప్రస్తుతం స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా స్నేహారెడ్డి రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ హీరో సతీమణికి కూడా స్నేహా రెడ్డి కి ఉన్న ఈ రేంజ్ ఫాలోయింగ్ లేదని చెప్పవచ్చు. ఏ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చిన స్నేహా రెడ్డికి ఈ రేంజ్ ఫాలోవర్లు ఉండటం అందరిని ఆశ్చర్యంలో ముంచుతోంది. తాజాగా స్నేహారెడ్డికి ఇన్ స్టాగ్రాంలో 40 లక్షల ఫాలోవర్సును సంపాదించుకుంది. ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన మొదటి వ్యక్తిగా స్నేహారెడ్డి ప్రసంశలు అందుకుంటోంది.