రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన RRR సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. రూ.550 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1,127 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నట విశ్వరూపానికి ట్రిపులార్ సినిమా ఓ నిదర్శనం అని చెప్పవచ్చు. దాదాపు నెల రోజుల పాటు మంచి కలెక్షన్లతో థియేటర్లలో సందడి చేసింది ఈ చిత్రం. ఇక ఈ సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు ప్రేక్షకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ జీ5 ప్లాట్‌ఫామ్ ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పే ఫర్ వ్యూ విధానంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించిన జీ5 సంస్థ తాజాగా ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. సబ్‌స్క్రైబర్లు అందరికి ఉచితంగానే ఈ సినిమా చూసే వెసులుబాటు కల్పించింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నది. తెలుగు, బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం మే 20న జీ5 ప్లాట్‌ఫామ్ ద్వారా ఓటీటీలో విడుదవులవుతోంది. తొలుత పే ఫర్ వ్యూ విధానంలో ఈ సినిమా అందుబాటులో ఉండబోతున్నట్లు జీ5 ప్రకటించింది. ఈ సినిమా చూడాలంటే జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా 200 రూపాయలు డబ్బులు చెల్లిస్తేనే సినిమా చూసే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఈ పే ఫర్ వ్యూ విధానంపై విమర్శలు రావడంతో జీ5 యాజమాన్యం వెనక్కి తగ్గింది.
ఇది కూడా చదవండి: OTTలో పే పర్ వ్యూ కాన్సెప్ట్ గురించి పూర్తి వివరాలు!
అభిమానుల కోరిక మేరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఈ సినిమాను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా గురువారం వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఇక చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కొమురంభీమ్ పాత్రలో ఎన్టీఆర్,అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించారు. ఈ సినిమాతోనే అలియాభట్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హాలీవుడ్ నటి ఒలివియామోరీస్…ఎన్టీఆర్‌కు జోడీగా నటించింది. ఈ చిత్రం ద్వారా మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా ఏంటో చాటాడు రాజమౌళి. ఇక జీ5 తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A good day indeed, as #ZEE5 Premium Subscribers can watch the World Digital Premiere for FREE from May 20th
Re-experience the roar, only on 4K Ultra HD!
Note: The best update from the roaring film!World Digital Premiere – ONLY on #ZEE5#RRRonZee5fromMay20 Download Zee5 app now pic.twitter.com/wAYh4LMQ0h
— ZEE5 Telugu (@ZEE5Telugu) May 19, 2022
ఇది కూడా చదవండి: RRR బాటలోనే KGF-2 సినిమా కూడా.. OTTలో చూడాలంటే డబ్బు కట్టాల్సిందే!