సినిమా రెస్పాన్స్ చూద్దామని వెళ్లిన దర్శకుడికి అదిరిపోయే రెస్పాన్స్ తో పాటు షాక్ ఇచ్చారు కొంతమంది. థియేటర్ లో దర్శకుడి ఫోన్ కొట్టేశారు.
ఏదైనా సినిమా విడుదలైందంటే ఆ సినిమాకి పని చేసిన వారందరికీ స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. ఫస్ట్ ఫస్ట్ షో ప్రేక్షకులతో కలిసి చూస్తారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, మిగతా సాంకేతిక నిపుణులు ఇలా తొలిరోజు సినిమా రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలని సినిమా చూసేందుకు వస్తారు. సినిమా బాగుంటే విజిల్స్, క్లాప్స్ విని సంతోషిస్తారు. సినిమా చూసి ప్రేక్షకులు అరుస్తున్నప్పుడు లైవ్ లో దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ చూస్తే ఆ కిక్కే వేరు. ఆ కిక్ ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన దర్శకుడికి ప్రేక్షకులు షాకిచ్చారు. సినిమా రెస్పాన్స్ చూద్దామని థియేటర్ కి వెళ్ళిన దర్శకుడి ఫోన్ కొట్టేశారు.
థియేటర్ కి వెళ్ళినప్పుడు జనం ఎగబడడం అనేది సహజం. ఆ గుంపులో, ఆ హడావుడిలో ఏ మూల నుంచి ఎవడు వస్తాడో తెలియదు. ఏం చేస్తాడో తెలియదు. ‘అన్న, నీకు పెద్ద ఫ్యాన్ అన్న.. నన్ను వాడుకో అన్న బాగా గాలేస్తుంది’ అని ఒకడు, ‘నేను నీకు ఏసీ అన్న.. గదిలో పెట్టుకో అన్న చల్లగా ఉంటుంది’ అని మరొకడు ఇలా మీద పడిపోతుంటారు. హీరోలకే కాదు ఈ మధ్య దర్శకులకి కూడా క్రేజ్ ఉంటుంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే దర్శకుడి పేరు మారుమ్రోగిపోతుంది. ఈ క్రమంలో విరూపాక్ష సినిమా దర్శకుడు కార్తీక్ దండు పేరు కూడా ఇప్పుడు బాగా వినబడుతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.
సినిమా రెస్పాన్స్ ఎలా ఉందా అని విరూపాక్ష చిత్ర బృందం థియేటర్ కి వెళ్లారు. సినిమా చూశారు. అంతా బాగుంది. తిరిగి వస్తుండగా ఎవరో దర్శకుడు కార్తీక్ దండు ఫోన్ కొట్టేశారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. సినిమా హిట్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు ఈ విషయాన్ని వెల్లడించారు. థియేటర్ లో తన ఫోన్ ఎవరో కొట్టేశారని, ఎవరైనా అడ్వాన్సులు ఇవ్వదలచుకుంటే నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కి ఫోన్ చేయాలని అన్నారు. ఫోన్ పోతే పోయింది గానీ ప్రేక్షకుల నుంచి సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ని మాత్రం ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఫోన్ పోగొట్టుకున్న దర్శకుడిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.