చేతబడి నేపథ్యాన్ని తీసుకుని, ప్రతి చిన్న అంశాన్ని వివరంగా చెప్తూ ‘విరూపాక్ష’ మూవీని అద్భుతంగా తీశాడు డైరెక్టర్ కార్తీక్ వర్మ. అతడి ప్రతిభనీ, కష్టాన్నీ మర్చిపోని నిర్మాతలు లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన విరూపాక్ష చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో తొలుత విలన్‌గా వేరే వారిని అనుకున్నారట. కానీ సుకుమార్ చేంజ్ చేసి సంయుక్తా మీనన్‌ను విలన్‌గా చేశారంట. ఈ విషయాలను దర్శకుడు కార్తీక్ దండు వివరించారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ గా కార్తిక్ వర్మ దండుకి, హీరోగా సాయి ధరమ్ తేజ్ కు ఇది బిగ్గెస్ట్ హిట్ గా చెప్పచ్చు. మరోవైపు ఈ సినిమాతో సంయుక్త మీనన్ కూడా టాలీవుడ్ లో లక్కీ చామ్ గా పేరు తెచ్చుకుంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా రోజులు తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు. తన 15వ సినిమా సెట్స్ పైకి వచ్చి రెగ్యులర్ షూట్ మొదలైపోయింది. ఈ సినిమాకి ప్రస్తుతం ఎస్‌డీటీ15 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ కథను సుకుమార్ రచించగా.. కార్తిక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. గత వినాయక చవితిరోజు బైక్ ప్రమాదంలో గాయపడిన తర్వాత సాయి తేజ్ సెట్స్ పైకి రావడం ఇదో తొలిసారి. సాయి తేజ్ కు క్రూ […]