తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ లుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోలుగా ఎదిగిన నటులు చాలా మందే ఉన్నారు. అదీ కాక కొంత మంది హీరోలు కొన్ని చిత్రాల తర్వాత విలన్ లుగా తెరపై కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, గోపీచంద్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి పెద్ద పెద్ద హీరోలు విలన్ లుగా వెండితెరపై నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరో.. ఓ భారీ ప్రాజెక్ట్ లో విలన్ గా నటించనున్నాడని ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఆ బడా హీరో ఎవరో కాదు టాలీవుడ్ అర్జున్ రెడ్డి.. విజయ్ దేవరకొండ. అవును విజయ్ దేవకొండ విలన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విజయ్ దేవరకొండ.. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. అతి కొద్ది కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు. పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా విజయ్ పేరు మారుమ్రోగిపోయింది. దాంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు విజయ్. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ గా వచ్చిన ‘లైగర్’ ఇండస్ట్రీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో బయట కనిపించడమే మానేడు విజయ్. ఈ నేపథ్యంలోనే ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? విజయ్ విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడని పరిశ్రమ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. రణ్ బీర్ కపూర్, అలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటించిన భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మూడు భాగాలుగా రానుందని మూవీ మేకర్స్ ప్రారంభంలోనే ప్రకటించారు. దాంతో రెండో భాగంపై దృష్టి పెట్టిన మేకర్స్.. తొలి భాగంలో మెయిన్ విలన్.. దేవ్ ను చూపించలేదు. ఈ క్రమంలోనే ఇండియా వైడ్ గా పేరున్న మంచి నటుడిని దేవ్ గా చూపిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దాంట్లో భాగంగానే విజయ్ ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకు విజయ్ అయితేనే న్యాయం చేయగలడని మేకర్స్ అనుకుంటున్నారు.
Reportedly, #VijayDeverakonda has been approached by the makers of #Brahmastra2 to play the titular role of ‘Dev’ in the film
Read:https://t.co/NtKCGQ2p2B pic.twitter.com/W5sID1o7OE— Jagran English (@JagranEnglish) November 8, 2022
అదీకాక విజయ్ దేవరకొండను తీసుకుంటే దక్షిణాదిలోనూ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని నిర్మాత కరణ్ జోహార్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అనుకుంటున్నారట. సినిమాలో విలన్ గానే కాకుండా రణ్ బీర్ తండ్రి పాత్రలో దీపికా పదుకునే కు జోడీగా విజయ్ కనిపిస్తారని కొన్ని ఇంగ్లీష్ పత్రికలు వార్తలు రాసుకొచ్చాయి. మరి లైగర్ ఫ్లాఫ్ లో ఉన్న విజయ్ ఈ ప్రాజెక్ట్ కు ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. దేవ్ పాత్రకు విజయ్ తో పాటుగా కేజీఎఫ్ స్టార్ యశ్ తోపాటు.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సైతం విలన్ గా తీసుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
रणबीर कपूर-आलिया भट्ट की ब्रह्मास्त्र 2 में विज़य देवरकोंडा बन सकते हैं ‘देव’ ; फ़िल्म को पैन इंडिया अपील देने के लिए साउथ एक्टर की ज़रूरत #Brahmastra2 @TheDeverakonda #Dev #VijayDeverakonda
LINK: https://t.co/HZ1pR1k9om pic.twitter.com/EwLFad6YDk— BollyHungama (@Bollyhungama) November 7, 2022