సినిమాను ప్రమోట్ చేసే విధానంలో కొంత మంది మూవీ మేకర్స్ హద్దులు దాటుతున్నారు. ప్రైవెట్‌గా చేయల్సిన పనులను స్టెజ్ మీద చేస్తున్నారు. ఇలా చేయండం వల్ల పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని తెలిసినా.. ఇలాటి పనులు చేస్తునరని కొందరు అభిప్రాయపడుతున్నారు.
విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ఖుషి మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో వేగం పెంచారు ఖుషి నిర్మాతలు. సెప్టెంబర్ 1 న విడుదల కాబోతున్న ఈ మూవీ కి సంబంధిన ఈవెంట్ ఇటీవలే ఒకటి జరిగింది. ఈవెంట్ లో సమంత గురించి విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ గురించి సమంత చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా అని అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరు చాలా మంచి నటులు. ఇద్దరికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. యూత్ లో కూడా ఇద్దరికీ చాలా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో వస్తున్న ఖుషి మూవీ కోసం వాళ్ళ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఖుషి సినిమాలోని.. ‘నా రోజా నువ్వే’ అనే పాట మారుమోగిపోతుంది. ఇంక అసలు విషయంలోకి వస్తే ఖుషి మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం మూవీకి సంబంధించిన మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించింది. విజయ్,సమంత లు ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ముందు కొన్ని చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. సమంత, విజయ్ కలిసి ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో విజయ్ తో సమంత గురించి మీకు తెలిసింది ఏంటని యాంకర్స్ అడిగితే.. సమంత సంతోషంగా ఉందా బాధలో ఉందా అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తను సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని అందరికీ పంచుతుంది. అదే తను ఎవరితోను మాట్లాడకుండా ఉన్నా, ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోయినా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నా , అసలు ఫోన్ కలవకపోయినా సమంత బాధలో ఉందని అర్థం చేసుకోవచ్చు.పైగా సంతోషాన్ని మాత్రం అందరితో పంచుకునే తను బాధని కనీసం ఎవరికీ చెప్పుకోదని సమంత మెంటాలిటీ గురించి చెప్పుకొచ్చాడు విజయ్.
ఇక సమంతని విజయ్ గురించి అడిగితే.. విజయ్ ఫోన్లు ఎక్కువగా మాట్లాడడు. ఏదైనా చెప్పాలి అనుకుంటే ఓన్లీ మెసేజ్ లు మాత్రమే చేస్తాడు. అలాగే ఎవరూ ఊహించని విధంగా విజయ్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి విజయ్ తన లైఫ్ లో ఎలాంటి వైఫ్ కావాలని కోరుకుంటున్నాడో కూడా చెప్పింది. విజయ్ కి కాబోయే భార్య తన ఫ్యామిలీ తో కలిసిపోయే చాలా సాధారణ అమ్మాయిగా ఉండాలని చెప్పి సమంత అందరికి షాక్ ఇచ్చింది. అలాగే విజయ్ వర్క్ లో చాలా సిన్సియర్ అని షూటింగ్ లొకేషన్ లోకి అడుగుపెడుతూనే ఈరోజు తీయబోయే సీన్ ఏంటి డైరెక్టర్ ని అడుగుతాడని సమంత విజయ్ గురించి చెప్పింది. ఇలా విజయ్ గురించి సమంత,సమంత గురించి విజయ్ వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ ని చెప్పడంతో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని అంటున్నారు.