గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలో చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూశారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నిపోన్ గోస్వామి గురువారం గౌహతిలో నేమ్ కేర్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆకస్మాత్తుగా పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 24 న నేమ్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
నిపోన్ గోస్వామి అస్సాంలోని 1942న సెప్టెంబర్ 3 న తేజ్‌పూర్‌లో జన్మించారు. తండ్రి చంద్రధర్ గోస్వామి ప్రముఖ నటుడు, తల్లి నిరుపమ గోస్వామి ప్రముఖ గాయని. ఎంతో ప్రతిష్టాత్మక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో శిక్షణ పొందారు. ఆయనతో పాటు సుభాష్ ఘాయ్, నవీన్ నిశ్చోల్, శత్రుఘ్న సిన్హా వంటి ప్రముఖులతో పాటు ఉత్తీర్ణత సాధించారు. 1957లో ఫణి శర్మ దర్శకత్వం వహించిన పియాలీ ఫుకాన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన గోస్వామి.. కొలిబారి ఎల్ ఫీ స్కూల్ నుండి ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించాడు.
విజయ్ సంగ్రామ్ చిత్రంలో నిపోన్ గోస్వామి కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 1969 లో రిలీజ్ అయిన డా. బెజ్‌బరువా చిత్రంతో మంచి స్టార్ డమ్ సంపాదించారు. తర్వాత అనేక చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలో నటించారు. బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. అంతేకాదు వ్రితు ఆహే రైటు జై’ వంటి కొన్ని టీవీ సీరియల్స్‌లో కూడా కనిపించాడు. అస్సామ్ లో ఎంతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న నిపోన్ గోస్వామి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.