టాలీవుడ్ లో శిల్పాచౌదరి పలు సంచలనాలకు తెర లేపింది. కిట్టీపార్టీల పేరుతో సంపన్న కుటుంబాల వారిని ఆకర్షించి.. పెద్ద మొత్తంలో వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులు శిల్పాచౌదరి పోలీసుల కస్టడీలో ఉంది. ఈ కేసులులో సొమ్ము రికవరీపై పోలీసులు దృష్టిసారించిన్నట్లు తెలుస్తోంది. శిల్పచౌదరి బాధితుల్లో ఐపీఎస్, ఇతర సినీ ప్రముఖులు , వారి బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని పరిష్కరించే దిశగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ తరహా సివిల్ కేసులు కోర్టుల ద్వారానే పరిష్కరించుకోవాలని పోలీసుల సలహాలు ఇస్తుంటారు. కానీ ఇది ప్రముఖులకు సంబంధించినది కాబట్టి అనధికారికంగా తమకు మౌఖిక ఫిర్యాదులతో కేసుపై దృష్టి సారించారని తెలుస్తోంది. శిల్ప చౌదరి విచారణలో తను ఏవరిని మోసం చేయలేదని.. వారి డబ్బులు వారికి ఇచ్చేస్తానని తెలిపినట్లు సమాచారం. తనకు డబ్బులిచ్చిన వారిలో చాలా మంది బాక్లమనీని వైట్ మనీగా మార్చకునే ప్రయత్నం చేశారని శిల్పచౌదరి తొలిరోజు విచారణలో తెలిపారు. రెండో రోజు కస్టడీలో శిల్పచౌదరి పెద్దగా విషయాలు ఏమి వెల్లడించలేదని తెలుస్తోంది.
ఇక తాను అమయాకురాలినని, రాధికారెడ్డి అనే మహిళ వద్ద డబ్బులు పెట్టాను. ఆమె చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వలేదు. నేను ఎవరికీ అన్యాయం చేయనని, అందరి డబ్బులిచ్చేస్తాని చెప్పినట్లు సమాచారం. మరో సందర్భంలో జెంటిల్ మెన్ సినిమా స్టోరీ తరహాలో.. ఓ ఆస్పత్రి నిర్మాణానికి అవసరం ఉంటే ఈ డబ్బులు ఖర్చుచేసినట్లు విచారణలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం. వీటికి సంబంధించి తన ఇంట్లో ఆధారాలున్నాయని చెప్పడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లి వాటిని స్వాధినం చేసుకున్నారు. హహలా డబ్బులపై పోలీసులు ఎలాంటి సమాధానం ఆమె నుంచి రాబట్టలేదని సమాచారం.ఇదే సమయంలో రాధికా అనే పేరుతో ఓ మహిళ మాదాపూర్ పోలీస్ స్టేషన్ వచ్చి…శిల్పతో తనకు ఎలాంటి సంబంధంలేదని, తన పేరు మీడియాలో వస్తుందని ఫిర్యాదు చేశారు. తన పేరు ప్రచారంలోకి రాకుండా మీడియాను నియంత్రించాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది.
