టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని విధంగా ఒక రేంజ్ డ్రామా నడుస్తోంది. డ్యాన్స్ యూనియన్ గొడవలతో మొదలైన ఈ రచ్చ.. ఇప్పుడు ఏకంగా ఆయన కెరీర్‌కే బ్రేకులు వేసేలా టర్న్ తీసుకుంది. జానీ మాస్టర్‌కు కోలుకోలేని షాకిస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.యూనియన్ నియమ నిబంధనలను ఉల్లంఘించారంటూ, ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ అస్త్రాన్ని ప్రయోగించింది ఫిల్మ్ ఫెడరేషన్. ఈ నిర్ణయం ఏదో నార్మల్‌గా తీసుకున్నది కాదు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్ జాతీయ స్థాయి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ గట్టి డిసిషన్ తీసుకున్నారు. నేషనల్ లెవెల్ బాడీ కూడా ఈ నిర్ణయానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేయడంతో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది.
ఫెడరేషన్ జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం… ఇకపై జానీ మాస్టర్ ఏ సినిమాకైనా, ఏ సాంగ్‌కైనా కొరియోగ్రఫీ చేస్తే.. ఇండస్ట్రీకి చెందిన మిగతా 23 క్రాఫ్ట్స్ సభ్యులు ఎవరూ సహకరించరు. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగత స్వార్థం కోసం, సొంత లాభాల కోసం చూసుకుని ఫెడరేషన్ మాట కాదని జానీ మాస్టర్‌తో కలిసి వర్క్ చేయడానికి ట్రై చేస్తే… వారిపై తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని గట్టి వార్నింగ్ ఇచ్చారు. “ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదంటూ ఫెడరేషన్ లీడర్లు కాకరేపుతున్నారు.
