చిరంజీవి, రాధ.. తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన క్రేజీ కాంబినేషన్ ఇది. మెగాస్టార్‌తో పోటీపడి మరీ హుషారుగా స్టెప్పులేసే వారామె. వీరిద్దరి కాంబినేషన్‌లో పలు సూపర్ హిట్ సినిమాలు, సూపర్ డూపర్ చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి.
చిరంజీవి, రాధ.. తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన క్రేజీ కాంబినేషన్ ఇది. మెగాస్టార్‌తో పోటీపడి మరీ హుషారుగా స్టెప్పులేసే వారామె. వీరిద్దరి కాంబినేషన్‌లో పలు సూపర్ హిట్ సినిమాలు, సూపర్ డూపర్ చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి. పోస్టర్ మీద ఈ జంట కనిపించిందంటే చాలు.. ప్రేక్షకాభిమానులు థియేటర్లకు పరుగులు తీసేవారు. పాటలప్పుడు హాళ్లో గోల గోల చేసేవారు. వీరి కలయికలో వచ్చిన సాంగ్స్ ఎవర్ గ్రీన్. రాధ ఎందరో స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కానీ చిరుతో ఆడిపాడిన తర్వాత ఆమె స్టార్‌డమ్ మరింత పెరిగింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాధ.. ఇద్దరు కూతుళ్లను కథానాయికలుగా పరిచయం చేయడానికి మళ్లీ సినీ రంగంలోకి వచ్చారు. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత బుల్లితెరపై కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నారు.
వీలు కుదిరినప్పుడల్లా తన స్టైల్లో స్టెప్పులేస్తూ.. అదిరిపోయే కామెడీ పంచులతో నవ్విస్తున్నారు. ఇదిలా ఉంటే రాధ, సదా, తరుణ్ మాస్టర్ జడ్జెస్‌గా.. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో ‘నీతోనే డ్యాన్స్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కలిసి నటించిన మూవీ ‘బ్రో – ది అవతార్’. ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా కేతిక శర్మతో కలిసి షోకి వచ్చాడు మెగా మేనల్లుడు తేజ్. యాంకర్, జడ్జిలతో కలిసి సరదాగా షో ఎంజాయ్ చేశాడు. ‘ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటారు?’ అని శ్రీముఖి అడిగితే ‘జీవితాంతం’ అని షాక్ ఇచ్చాడు తేజ్. తనకు సపోర్ట్‌గా కామెంట్ చేస్తూ ‘బ్రో’ అని సంబోధించింది సదా. దీనికి తేజ్ ‘మీరు బ్రో అంటే వెళ్లవయ్యా వెళ్లు అంటాం మేం కూడా’ అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు.
ఇక ఈ ప్రోమోలో హైలెట్ ఏంటంటే.. మెగాస్టార్ పాటకి రాధతో కలిసి డ్యాన్స్ చేశాడు తేజ్. ‘యముడికి మొగుడు’ లోని ‘అందం హిందోళం’ సాంగ్‌కి రాధ ఎనర్జిటిక్‌గా మూమెంట్స్ వేసి ఆశ్చర్యపరిచారు. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టెప్పులతో అలరించారు. ‘ఇట్స్ లైక్ ఎ డ్రీమ్.. చిరంజీవి గారితో డ్యాన్స్ చెయ్యలేకపోయినా మీతో డ్యాన్స్ చేశాను’ అంటూ ఎగ్జైట్ అయ్యాడు. ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. తేజ్ ఇంతకుముందు ‘కొండవీటి దొంగ’ లోని ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో’ పాటను ‘సుప్రీమ్’ సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి : రష్మీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్! రాత్రికి వస్తావా అంటూ..!