కార్తీక దీపం సీరియల్ తెలియని తెలుగు ప్రేక్షకులంటూ దాదాపు ఎవ్వరూ ఉండరు. అంతాల అందరిని ఆకట్టుకుంది ఆ సీరియల్. అందులోని వంటలక్క,డాక్టర్ బాబు, మోనితాల క్యారెక్టర్లకి ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. ఈ సీరియల్ లో మోనిత పాత్రలో విలన్ గా నటించి అందరిని మెప్పిస్తుంది కన్నడ భామ శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనితా స్టార్ డమ్ సంపాదించింది. ఈ బ్యూటీ కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించింది. అయితే కార్తీక దీపం ద్వారా వెలుగులోకి వచ్చింది. సినిమా, సీరియల్స్ తో బిజీగా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. తన హాట్ పిక్స్ తో కుర్రాళ్ల మతిపొగొడుతుంది. తాజాగా పింక్ డ్రెస్ తో దిగిన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవతోన్నాయి.
కార్తీకదీపం సీరియల్ తో మోనితగా శోభా శెట్టి తెలుగు బుల్లితెర పరిచయమైంది. కన్నడ కు చెందిన ఈ బ్యూటీ అక్కడ పలు సీరియల్ లో కూడా నటించింది. అయితే అసలు గుర్తింపు మాత్రం కార్తీక దీపం సీరియల్ లో విలన్ పాత్రతో వచ్చింది. కన్నడలో ఓ సినిమాలో కూడా శోభా నటించింది. ప్రస్తుతం కన్నడ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ.. తెలుగు సీరియల్స్ లో మాత్రం విలన్ పాత్ర చేస్తూ మెప్పిస్తుంది. సీరియల్స్ లో అలా క్రూరంగా ఉండే మోనిత.. బయట మాత్రం ఎంతో మంచిదంట. ఈ అమ్మడి మంచితనానికి ఎంతో మంది జనాలు అభిమానులయ్యారు. ఇటీవల ఈ బ్యూటీ ఓ యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసింది.
అందులో ఈ అమ్మడు చేసే అల్లరి మామూలుగా ఉండదు. తన సీరియల్ కు సంబంధించిన విషయాలను కూడా తన ఛానల్ పోస్ట్ చేస్తుంది. షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉండే ఈ భామ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ ఉంటుంది. శోభా శెట్టికి నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో శోభా శెట్టి తన సోకులను పరిచింది. పింక్ డ్రెస్ లో నడుము అందాలను ప్రదర్శిస్తూ శోభా శెట్టి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతోన్నాయి.