ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది రంభ. కెనడాకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ప్రస్తుతం రంభ పెద్ద కుమార్తె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
విజయలక్ష్మి అంటే తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టలేరేమో కానీ.. రంభ అంటే చాలు టక్కున గుర్తుకు వస్తుంది. అందం, అభినయంతో టాలీవుడ్‌లో కొన్నాళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్‌గా రాణించింది రంభ. టాలీవుడ్‌లో అప్పటి స్టార్‌హీరోలందరి సరసన నటించింది. టాలీవుడ్‌లో మాత్రమే కాక.. కోలీవుడ్, శాండిల్‌వుడ్, బెంగాలీ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా రాణించింది రంభ. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రంభ. ఆ వెంటనే వరుస అవకాశాలు అందిపుచ్చుకుని.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎందిగింది. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో.. 2010లో వివాహం చేసుకుని.. సినిమాలకు గుడ్ చెప్పింది రంభ. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను 2010లో వివాహం చేసుకుంది రంభ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు సంతానం ఉన్నారు. ప్రస్తుతం వీరు కెనడాలోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇండియాకు వస్తుంటుంది రంభ. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది రంభ. తన కుటుంబం, పిల్లలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది రంభ. ఇలా ఉండగా తాజాగా తన పెద్ద కుమార్తెకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది రంభ. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.
రంభ పెద్ద కుమార్తె లాన్య.. అచ్చ తెలుగు ఆడపిల్లగా ముద్దుగా సింగారించుకుని.. ఓ కార్యక్రమానికి హాజరైంది. రెండు జడలు, పాపిటి బిళ్ల, లంగా జాకెట్‌లో బుట్ట బొమ్మలా ముద్దుగా ఉంది లాన్య. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా.. ఇవి చూసిన వారు.. మేడం మీ కుమార్తె అచ్చం మీలానే ఉంది.. మీరు స్కూల్ డేస్‌లో ఎలా ఉండేవారో.. మీ కుమార్తె అలానే ఉంది.. చాలా అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.