బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు సీఎం జగన్ కు బర్త్ డే విషెష్ చెప్పారు. అలానే ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తునా సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించారు. ఈ పుట్టిన రోజుతో జగన్ మోహన్ రెడ్డి 50వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీశ్రేణులు, ఇతర నాయకులు ‘జగనన్న స్వర్ణోత్సవం’ పేరుతో సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా ఈ సంబరాలు జరిగాయి. ఈ వేడుకలకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా, కమెడియన్ అలీ హాజరయ్యారు. అలానే జబర్దస్త్ టీమ్ ఈ వేడుకలో సందడి చేసింది. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలో యాంకర్ అనసూయ కూడా పాల్గొంది. అంతేకాక జగన్ పుట్టిన రోజు వేడుకలో అనసూయ కేట్ కట్ చేసింది. అనంతరం తోటి జబర్దస్త్ టీమ్ తో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ వ్యాప్తంగా ‘జగనన్న స్వర్ణోత్సవ’ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా ‘జగనన్న స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ప్రభుత్వ మీడియా సలహాదారుడు అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకకు యాంకర్ అనసూయ, హైపర్ ఆదితో పాటు జబర్దస్త్ నటులు హాజరై.. సందడి చేశారు. అలీ, అనసూయలు డ్యాన్స్‌తో అదరగొట్టారు. అలానే అదిరే అభి, మహేష్, రాకేష్ కూడా తమదైన కామెడీ మాటలతో అందరిని అలరించారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే.. హైపర్ ఆది డ్యాన్స్ మరొక ఎత్తు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న హైపర్ ఆది.. తనదైన మాటలతో, డ్యాన్స్ అందరిని అలరించాడు.
జగనన్న సంబరాల్లో జబర్దస్త్ టీం స్టెప్పులు..! – TV9 #CMYSJagan #Jabardast #MinisterRoja pic.twitter.com/bkNqOrmtta
— TV9 Telugu (@TV9Telugu) December 20, 2022
అంతేకాక మంత్రి రోజాతో కలిసి అనసూయ డ్యాన్స్ చేశారు. జబర్దస్త్ రోహిణి, పవిత్ర, యాంకర్ అనసూయ అదిరిపోయే డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. జగనన్న స్వర్ణోత్వవాల్లో భాగంగా జరిగిన వివిధ పోటీల్లో గెలిచిన వారు రోజా, అనుసూయ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ఇక అనసూయ పట్టుచీరలో డ్యాన్స్ చేస్తూ అందరిని అలరించింది. ఈ వేడుకలో మంత్రులతో కలసి రంగమ్మత్త అనసూయ కూడా కేట్ కట్ చేసింది. జగనన్న స్వర్ణోత్సవ వేడుకల్లో జబర్దస్త్ టీమ్ చేసిన సందడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ.. ఈవీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.