నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ‘వీరసింహా రెడ్డి’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ‘జైబాల్యయ’ అంటూ లిరికల్ సాంగ్ విడుదలైంది. సాంగ్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఖద్దరు చొక్కాలో ట్రాక్టర్ మీద వస్తున్న బాల్యయకు అభిమానులు ఫిదా అయిపోయారు. ప్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈసినిమాలో బోయపాటి సినిమాల్లో కంటే వైలెంట్‌గా గోపీచంద్ మలినేని ప్లాన్ చేశాడు. ఇప్పటికే విడుదలైన డైలాగ్ ప్రోమోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ జైబాలయ్య సాంగ్‌లో అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా బాగా హైలెట్ అయ్యాడు. తెల్ల పంచ, తెల్ల చొక్కాతో మెడలో పెద్ద పెద్ద బంగారు గొలుసులు వేసుకుని తమన్ కూడా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు.
అయితే ఇప్పుడు ఈ పాటపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక పాట విడుదల అయ్యింది అంటే అది అందులో కాపీ చేశారు, ఇందులో కాపీ చేశారు అంటూ విమర్శలు సాధారణంగానే వస్తుంటాయి. అలాగే ఈ పాటపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. జై బాలయ్య ట్యూన్ అచ్చు ఒసేయ్ రాములమ్మ పాటను పోలి ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మళ్లీ తమన్ ట్యూన్ కాపీ కొట్టేశాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు రామజోగయ్య శాస్త్రిపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సరస్వతీ పుత్ర’ అని పేరుకి ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట వచ్చే ఈ ట్రోల్స్ కి రామజోగయ్య శాస్త్రి భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..
అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను
సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు..
ఉంటే ఇటు రాకండి🙏— RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022
పాటపై, తనపై వస్తున్న విమర్శలకు రామజోగయ్య శాస్త్రి నొచ్చుకున్నారు. ట్రోల్ చేసేవారిపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా సమాధానం ఇచ్చారు. “ప్రతి పాటను ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను… దయచేసినన్ను గౌరవంగా చూడగలిగే వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు.. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను.. ఇందులో ఎవరికీ ఏమీ ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి” అంటూ రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. అయితే రామజోగయ్య శాస్త్రికి బాలయ్య అభిమానులు అండగా నిలుస్తున్నారు. సంస్కారంలేని వాళ్ల మాటలను పట్టించుకోకండి అంటూ చెబుతున్నారు.