ఆమె సౌత్ తో పాటు నార్త్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ దాదాపు ఆరేళ్లపాటు పలు సినిమాలు చేసింది. అయితే పవన్ పక్కన హీరోయిన్ గా చేయడం మాత్రం ఈమెకు ఎప్పటికీ స్పెషల్. మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ఆమెని చూస్తే అందమే అసూయపడుతుంది. నవ్వితే ముత్యాలు రాలుతాయి. చీర కడితే సూపరు. బికినీ లేదా వేస్తే బంపరు. ఇలా ఏ ఔట్ ఫిట్ లో చూసినా సరే మీ నోరు తడారిపోవడం గ్యారంటీ. ఎందుకంటే గ్లామర్ అలాంటిది మరి. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ విన్నప్పుడు ఏదో అనుకున్నాం గానీ ఇలాంటి హీరోయిన్స్ ని చూసినప్పుడు ఆ డైలాగ్ ఇలాంటి బ్యూటీస్ కోసమే రాశారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతకు మించిన రేంజ్ అందంతో కట్టిపడేస్తూనే ఉన్నారు. మరి ఇంతలా చెబుతున్నాం కదా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన కనిపిస్తున్న ఇద్దరు చిన్నారుల్లో పసుపు డ్రస్ లో ఉన్నామే కృతి కర్బందా. పేరు చెప్పగానే టక్కున గుర్తురాకపోవచ్చు. ఎందుకంటే ఈమె చివరగా 2015లో తెలుగులో అది కూడా రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’లో కనిపించింది మరి. ‘బోణీ’ సినిమాతో హీరోయిన్ గా మారిన కృతి.. తెలుగులో చిత్రాలు చేస్తూనే, కన్నడలోనూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలా 2009-15 మధ్య తెలుగు, కన్నడ మూవీస్ చేసిన ఈమె.. ఆ తర్వాత ముంబయికి మకాం మార్చింది. అలా గత నాలుగైదేళ్లలో కేవలం హిందీ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకున్నా వాటిపై అధికారిక ప్రకటన రాలేదు.
ఇక ఈమె ఎన్ని తెలుగు సినిమాలు చేసినా సరే పవన్ కల్యాణ్ ‘తీన్ మార్’ మాత్రం కృతి కర్బందాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాశీ ఎపిసోడ్ లో క్యూట్ గా చీరకట్టుతో కృతి కనిపిస్తుంది. ‘వయ్యారాలా జాబిల్లి’, ‘శ్రీ గంగ’ పాటల్లో కనిపించిన బ్యూటీ ఈమెనే. అలా పవన్ కు హీరోయిన్ గా చేసిన కృతి.. ‘బ్రూస్ లీ’లో చరణ్ కు అక్కగా నటించింది. ఇలా ఇద్దరు మెగాహీరోలతో యాక్ట్ చేసిన కృతి.. ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ లో పెద్దగా ఛాన్సుల్లేక ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో కృతి కర్బందా లవ్ లో ఉంది. వీళ్ల పెళ్లి ఇంకా జరగాల్సి ఉంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈమె.. హాట్ హాట్ పోజులతో నెటిజన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటుంది. మరి చిన్నప్పటి ఫొటోలో ఈమెని ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.