Agaram Foundation: ప్రముఖ తమిళ హీరో సూర్య నటన విషయంలో నూటిని నూరు మార్కులు తెచ్చుకున్నారు. సినిమాకు సినిమాకు మధ్య కథలో వ్యత్యాసం చూపిస్తూ.. నటనకు ప్రాథాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. కేవలం సినిమాలో హీరోగా మంచి పనులు చేయటమో కాదు.. బయట కూడా ఆయన తన మంచి పనులతో హీరో అనిపించుకుంటున్నారు. హీరో సూర్య కుటుంబానికి ‘అగరమ్’ అనే ఓ ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది బాల, బాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. మరెంతో మంది అవరసమైన వారికి సహాయం చేస్తున్నారు.
సూర్య తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తిలు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నో మంచి పనులు చేస్తున్న అగరమ్ ఫౌండేషన్‌ను కొంతమంది హ్యాకర్స్ టార్గెట్ చేశారు. ఫౌండేషన్ అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేశారు. హ్యాక్ చేయటమే కాదు అందులో ఈ విధంగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ మాకు విరాళాలు కావాలి. వాలంటీర్స్ ఈ కింది అడ్రస్‌కు డబ్బులు పంపగలరు’’ అని ఓ అడ్రెస్ కోడ్‌ను పంపారు. ఇక, తమ అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసినట్లు ‘అగరమ్’ గుర్తించింది. ఆ వెంటనే తమ ట్విటర్ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది.
‘‘ అగరమ్ ఫాండేషన్ అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవుతున్న వారికి విజ్ఞప్తి. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాకర్స్ హ్యాక్ చేశారు. మీరు డబ్బులు డొనేట్ చేయటం కానీ, మెసేజ్‌లు పెట్టడం కానీ చేయకండి. త్వరలో ఆ సమస్యను పరిష్కరిస్తాం’’ అని పేర్కొంది. కాగా, హీరో సూర్య 2006లో అగరమ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా దాదాపు 16 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. మరి, సూర్య ‘అగరమ్’ ఫౌండేషన్ ఇన్‌స్టాగ్రామ్ అఫిషియల్ ఖాతాను హాకర్స్ హ్యాక్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hack panni story um potachi..😡😡@Suriya_offl @agaramvision #suriya42 #vaadivaasal https://t.co/gbbKzz9uJm pic.twitter.com/ZD0Fv35L7j
— Sᴜʀɪʏᴀ42 ᵐᵒᵗⁱᵒⁿ ᵖᵒˢᵗᵉʳ (@Lovelya58568288) September 24, 2022