సురేఖావాణి మళ్లీ కాక రేపింది. బీచ్ దగ్గర అలా ఊరికే నడుస్తూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దానికింద కామెంట్స్ అయితే రచ్చ రచ్చ అనేలా వస్తున్నాయి. మీరు ఆ ఫొటోని చూస్తే మాత్రం అదే పనిగా చూస్తూ ఉండిపోతారు.
మీకు సురేఖావాణి తెలుసా? అని అడగ్గానే.. ఓ యస్, ఆమె మాకు తెలియకపోవడం ఏంటి? రోజూ చూస్తూనే ఉంటాం. ఆమె ఫొటో చూడనిదే మాకు డే స్టార్ట్ కాదు తెలుసా అని చాలామంది టక్కున తడుముకోకుండా చెప్పేస్తారు. పేరుకే సీనియర్ నటిగానీ హీరోయిన్లకు ఉన్నంత ఫాలోయింగ్ సురేఖావాణి సొంతం. సినిమాల్లో తల్లి, వదిన క్యారెక్టర్స్ చేస్తూ చాలా పద్ధతిగా చీరలతో ఉండే ఈమె.. బయట మాత్రం పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది. టీనేజ్ అమ్మాయిలకు పోటీ ఇచ్చే రేంజులో టైట్ ఫిట్ డ్రస్సులతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఫొటో, వీడియో పోస్ట్ చేయడం లేటు.. కుర్రాళ్ల నుంచి అంకుల్స్ వరకు అందరూ కామెంట్ చేయడానికి క్యూ కట్టేస్తారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సురేఖావాణి ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంది. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులకు కాస్తో కూస్తో పరిచయమే. ఇక కొన్నేళ్ల ముందు వరకు ఈమె బయట ఎలా ఉంటుంది? అనేది తెలియదు. ఎప్పుడైతే సోషల్ మీడియా కల్చర్ బాగా పెరిగిపోయిందో.. అప్పటినుంచి తను నార్మల్ గా ఎలా ఉంటానో చెబుతూ అలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. ఇక సురేఖావాణి కూతురు సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఈ తల్లీకూతురు.. ఎప్పడూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటారు. హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్లని అలరిస్తూనే ఉంటారు.
తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా గోవా ట్రిప్ వేసిన సురేఖావాణి-సుప్రీత కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. అయితే అవి పక్కనబెడితే సురేఖావాణి.. ఆరెంజ్ కలర్ డ్రస్సులో బీచ్ దగ్గర నడుస్తున్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఆ ఫొటోని అదే పనిగా చూస్తూ ఉండిపోవచ్చు అనేంత హాట్ గా ఇందులో ఉంది. ఇక తాజాగా జ్యూస్ తాగుతున్న మరో ఫొటోని సురేఖావాణి పోస్ట్ చేసింది. ఇందులో ఆమెని చూస్తే అచ్చం కూతురు సుప్రీతలానే అనిపిస్తుంది. తన సోయగాలతో ఎప్పటికప్పుడు కట్టిపడేస్తున్న సురేఖావాణి ఫొటోలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది. కింద కామెంట్ చేయండి.