ప్రముఖ దర్శకుడు రాజమౌళితో అంతర్జాతీయ స్థాయి సినిమా SSMB29తో బిజీగా ఉంటూనే నిర్మాతగా అవతారమెత్తాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ ఫస్ట్ లుక్‌లో కన్పిస్తున్న హీరోని గుర్తు పట్టారా లేదా..
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా త్వరలో తెరకెక్కనుంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఆకట్టుకున్న వెంకటేశ్ మహాతో సినిమా నిర్మించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుద చేయడమే కాకుండా రావు బహదూర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో కన్పిస్తున్న హీరోను గుర్తు పట్టారా లేదా..పూర్తి ఢిఫరెంట్ లుక్‌లో కన్పిస్తున్న ఈ హీరో మరెవరో కాదు..సత్యదేవ్. ముసలి రాజు గెటప్‌లో ఏ మాత్రం గుర్తు పట్టలేనట్టుగా ఉన్నాడు.
ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో సత్యదేవ్ నెగెటివ్ పాత్రతో పేరు తెచ్చుకున్నాడు. రావు బహదూర్ టైటిల్ కాగా అనుమానం పెనుభూతం అనేది సినిమా ట్యాగ్ లైన్‌గా ఉంటుంది. గతంలో వెంకటేశ్ మహా..సత్యదేవ్ హీరోగా ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య సినిమా కూడా తీశారు. అయితే అది రీమేక్ సినిమా. ఇది పూర్తిగా తెలుగు సినిమా. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేసేందుకు సిద్దమౌతున్నారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే కామెడీతో కూడిన ఫాంటసీ డ్రామా సినిమా అని తెలుస్తోంది.
బ్లఫ్ మాస్టర్ సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న సత్యదేవ్ జీబ్రా సినిమా కూడా ఫరవాలేన్పించింది. సినిమా కధాపరంగా ఏమైనా లోటుపాట్లున్నా సత్యదేవ్ నటనలో మాత్రం అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబు నిర్మాతగా వస్తున్న ఈ ఫాంటసీ సినిమాలో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.