కొందరికి ఎందుకో గానీ హుందాతనం ఉండదు. చీప్‌గా బిహేవ్ చేస్తుంటారు. నలుగురిలో ఉన్నప్పుడైనా కాస్త హుందాగా ఉండాలన్పించదేమో. బహిరంగ వేదికపైనుంచి మాట్లాడుతున్న ఈ హీరోయిన్ నడుము తాకుతూ అసభ్యంగా వ్యవహరించాడు ఈ హీరో. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హుందాతనం లేదా నడవడిక అనేది బహుశా పెంపకాన్ని బట్టి వస్తుందంటారు. అందుకే చాలామంది ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక్కోసారి చాలా చీప్ బిహేవియర్ ప్రదర్శిస్తుంటారు. నలుగురూ ఉన్నప్పుడు కాస్త హుందాగా ఉండాలనే ఇంకిత జ్ఞానం మర్చిపోతారు. ఆడదైతే చాలా ఏమైనా చేయొచ్చనుకుంటారేమో. ఈ స్టార్ హీరో అదే పని చేసి ఛీ అన్పించుకుంటున్నాడు. ఓ బహిరంగ వేదికపై పక్కన నిలుచుని మాట్లాడుతున్న తోటి హీరోయిన్ నడుము పదే పదే తాకుతూ జుగుప్సాకరంగా వ్యవహరించి తిట్లు తింటున్నాడు.
భోజ్‌ఫురి ఇండస్ట్రీ గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ కాస్త గుర్తింపు ఉన్న స్టార్ హీరో పవన్ సింగ్. ఇప్పుడితనిపైనే విమర్శలు వస్తున్నాయి. ఓ ఈవెంట్‌కు హాజరైన ఇతడు తన పక్కనే ఉండి మాట్లాడుతున్న తోటి హీరోయిన్ అంజలి నడుమును పదే పదే చేతితో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు అసౌకర్యం కలుగుతున్నా వదిలిపెట్టలేదు. ఇంకా అంజలినే నవ్వుతూ ఈ ఘటనను కవర్ చేసేందుకు ప్రయత్నించింది. అందుకే నెటిజన్లు హీరో పవన్ సింగ్‌పై మండిపడుతున్నారు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే చిన్నచూపు ఇప్పటికీ ఉంది. కారణం ఇలాంటి హీరోల ప్రవర్తన వల్లనే. హీరోయిన్లను చాలా అవమానకరంగా చూస్తారనే ప్రచారం ఉండనే ఉంది. ఇటీవల జరిగిన మీ టూ ఉద్యమం పుణ్యమా అని చాలామంది వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు బయటికొస్తున్నాయి. ఇప్పుడు పవన్ సింగ్ అందరి ముందు చేసిన అసభ్య ప్రవర్తనకు ఎలాంటి సమాధానమిచ్చుకుంటాడో మరి.
भोजपुरी के कथित सुपरस्टार
कभी भाजपा से सांसद बनना चाह रहे थे और आज ये हरतक…#PawanSingh pic.twitter.com/zVy3iJgvlC
— AJAY (@ajaygautamm) August 28, 2025