పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. తరుచు వివాదాల్లో ఉండే శ్రీరెడ్డి గత కొంత కాలం నుంచి పెద్దగా వార్తల్లో కనిపించటం లేదు. అయితే ఇటీవల రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈ వెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల పోసాని కృష్ణ మురళి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో వెంటనే పవన్ అభిమానులు ఆయనపై ఏకంగా దాడికి సైతం దిగబోయారు.
ఈ నేపథ్యంలోనే స్పందించింది శ్రీరెడ్డి. ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఈ పావలా గాడికి ఏం ప్యాకేజ్ అందిందో నాకైతే తెలియదు కానీ.. ప్రతిసారి ఎనకాల జనసేన గుర్తు వేసుకొని ఓ సభ లాంటిది పెట్టిస్తున్నాడు. అందులో ఒక నలుగురు ఆడ పిల్లలను ముందు సీట్లలో కుర్చోబెట్టుకొని, పది మంది ఈలలు వేసే బ్యాచులను డబ్బులిచ్చి పిలిపించుకొని నానా హంగామా చేస్తున్నావు. నీ వెనకాల తెలంగాణాలో ఓ యూనివర్సిటీలో నువ్వు ఎవ్వరిని పోషిస్తున్నావో, ఏ అల్లరి మూకని, చిల్లర మూకని నువ్వు పోగుచేసి బ్లాక్ మెయిల్ చేయడానికి మెయిన్‌టైన్ చేస్తున్నావో ఆ గ్రూపులను, వాళ్ళ పేర్లతో సహా బయటపెడతా.
ఇక నువ్వు చిల్లర మూకలతో ఎలా అయితే దాడులు చేపిస్తున్నావో అవి మేము చేయించలేమా? అలాంటివి మేము చేయించాలంటే పెద్ద విషయమా? అంటూ చెప్పుకొచ్చింది. కాసేపు కోడి కత్తులంటావు.. కాసేపు వేల కోట్లంటావు .. ఇలా ప్రతీ ఒక్క మాటకి ప్రెస్ మీట్ పెట్టి మరీ సమాధానం చెబుతా వెయిట్ చేయి. ఆ ప్రెస్ మీట్ చూసి ఉరేసుకుంటావో, చస్తావో.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ శ్రీరెడ్డి ఈ వీడియోలో తెలిపింది. తాజాగా శ్రీరెడ్డి పోస్ట్ ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.