ప్రస్తుతం నడుస్తోంది సోషల్ మీడియా యుగం. ఒక్కసారి ఇక్కడ రీచ్ పెంచుకుంటే వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. ఇందుకే స్టార్ హీరోయిన్స్ సైతం సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు. ఈ విషయంలో బుల్లితెర బ్యూటీలు అయితే తెగ హడావిడి చేస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు కూడా వచ్చి చేరింది. డిజిటిల్ మీడియాలో సాధారణ యాంకర్‌గా స్రవంతి చొక్కారపు తన కెరీర్ స్టార్ట్ చేసింది.
అయితే.. పుష్ప ఇంటర్వ్యూతో ఈ అమ్మడికి అదృష్టం కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొనడంతో స్రవంతి చొక్కారపు తెలుగు వారికి సుపరిచితురాలైపోయింది. ఆ షోలో స్రవంతి బాగానే పెర్ఫామెన్స్ చేసి హైలెట్ అయ్యింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ అమ్మడు అందాల ఆరబోతలో మరింత డోసు పెంచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యువతకు పిచ్చెక్కించే ఫొటోలు పోస్టు చేస్తూ.. సోషల్ మీడియాను షేకాడిస్తోంది.
ఇందులో భాగంగానే స్రవంతి తాజాగా ఒక బీచ్‌లో బ్లాక్ కలర్ బికినీలో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక.. ఈ అమ్మడికి ఇప్పుడిప్పుడే సినిమా ఆఫర్స్ కూడా తలుపు తడుతున్నట్టు తెలుస్తోంది. స్రవంతి గ్లామరస్ పిక్స్ చూసిన నెటిజన్స్ మాత్రం అయ్య బాబోయ్ స్రవంతిలో ఇంత వెరియేషనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. స్రవంతి గ్లామరస్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.